క్యాబేజీని తరగడంలో ఇతడికి ఇతడే సాటి.. వీడియో వైరల్!

  • వాయు వేగంతో క్యాబేజీ అదనపు లేయర్లను కత్తిరిస్తున్న వ్యక్తి
  • ట్విట్టర్ లో సంచలనంగా మారిన వీడియో
  • 10 లక్షల మందికి పైగా వీక్షణ
వారంతా కూరగాయల వర్తకులు. అది హోల్ సేల్ వెజిటబుల్ మార్కెట్. విక్రయానికి వచ్చిన క్యాబీజీలను శుభ్రం చేసే పని పెట్టుకున్నారు. క్యాబేజీలు రాసులుగా పోసి ఉన్నాయి. వాటిని ఫిల్టర్ చేస్తూ మూటలుగా కట్టి పేరుస్తున్నారు. ఈ సందర్భంగా వారి నైపుణ్యాలను పరిశీలిస్తే ఎవరైనా నోరు వెళ్లబెట్టాల్సిందే. 

క్యాబేజీలపైన ఎన్నో లేయర్ల చొప్పున పొరలుపొరలుగా ఉంటాయని తెలిసిందే. వాటిల్లో పనికిరాని పై లేయర్లను తొలగించి క్యాబేజీలను ప్యాక్ చేస్తున్నారు వారంతా. ఎంతో వాయు వేగంతో చేస్తున్న పనిని చూసి ఆశ్చర్యానికి గురి కావాల్సిందే. ఎందుకంటే ఎంతో చక్కని సమన్వయంతో, ఒక లెంత్ లో అలవాటైన విధానంలో వారు చేస్తున్న పని అంత గొప్పగా కనిపిస్తుంది. ఒక వ్యక్తి కింద కూర్చుని ఒక్కో క్యాబేజీని పైకి విసురుతుంటే.. మరో వ్యక్తి చాకుతో అంతే వేగంగా క్యాబేజీని పట్టుకుని అదనపు లేయర్లను కత్తితో తెగ్గోసి పక్కకు విసురుతుంటే.. మరో వ్యక్తి దాన్ని పట్టుకుని బ్యాగులో వేయడాన్ని వీడియోలో చూడొచ్చు. 

అందుకే ఈ వీడియోను గ్రీన్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిస్టిట్యూట్ ప్రెసిడెంట్ ఎరిక్ సోల్హీమ్ ట్విట్టర్లో పంచుకున్నారు. ఈ వీడియోను ఇప్పటికే 10 లక్షల మందికి పైగా వీక్షించారు. ‘‘భారత్ కు రోబోటిక్ ఆటోమేషన్ అవసరం లేదనేది ఇందుకే’’ అంటూ ఎరిక్ సోల్హీమ్ కామెంట్ పెట్టడం అతికినట్టుగా ఉంది. చాలా మంది తమ స్పందనను తెలియజేస్తున్నారు. అయితే, వీరు ఈ పనిచేస్తున్నది ఎక్కడన్న వివరాలు మాత్రం ఇందులో లేవు.


More Telugu News