టాలీవుడ్ కి మలయాళ భామను పరిచయం చేస్తున్న 'శేఖర్'
- మలయాళంలో హిట్ కొట్టిన 'జోసెఫ్' సినిమా
- తెలుగు రీమేక్ గా రూపొందిన 'శేఖర్ '
- మలయాళంలో చేసిన పాత్రనే తెలుగులో చేసిన ఆత్మీయ రాజన్
- తెలుగులో ఆమెకి ఇదే మొదటి సినిమా
- ఈ నెల 20వ తేదీన ఈ సినిమా విడుదల
తెలుగు తెరకి మొదటి నుంచి కూడా మలయాళ భామల తాకిడి ఎక్కువే. ఇక్కడ బాలీవుడ్ భామల జోరుకు బ్రేకులు వేసింది మలయాళ మందారాలే. అదే దారిలో ఇప్పుడు మరో మలయాళ భామ 'శేఖర్' సినిమాతో పరిచయమవుతోంది .. ఆ సుందరి పేరే ఆత్మీయ రాజన్. రాజశేఖర్ హీరోగా చేసిన ఈ సినిమా ఈ నెల 20వ తేదీన విడుదలవుతోంది.
జీవిత దర్శకత్వం వహించిన ఈ సినిమా, మలయాళంలో ఆ మధ్య వచ్చిన 'జోసెఫ్' సినిమాకి రీమేక్. ఆ సినిమాలో పాటలు ఉండవు. తెలుగు నేటివిటీకి తగినట్టుగా చేసిన మార్పుల వల్ల ఇందులో పాటలు కూడా చోటు చేసుకున్నాయి. ఇక ఆ సినిమాలో ఆత్మీయ రాజన్ పోషించిన పాత్రకిగాను, తెలుగులోను ఆమెనే తీసుకున్నారు.
ఇటీవలే రాజశేఖర్ .. ఆత్మీయ రాజన్ పై చిత్రీకరించిన ఒక పాటను కూడా విడుదల చేశారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, శివాని రాజశేఖర్ కూడా ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది. విశ్రాంత జీవితాన్ని గడుపుతున్న ఒక పోలీస్ ఆఫీసర్ జీవితంలో చోటుచేసుకున్న అనూహ్యమైన సంఘటనల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.