సినిమా వాళ్లకు చిన్నారిని అమ్ముకున్నానన్న వార్తలు నిజం కాదు: కరాటే కల్యాణి
- మరోసారి వివాదంలో కరాటే కల్యాణి
- చిన్నారి దత్తత వివాదంపై మీడియా సమావేశం
- తానెక్కడికీ పారిపోలేదని వెల్లడి
- తాను పరిగెత్తించే రకం అని స్పష్టీకరణ
ఇటీవల యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డితో వివాదం నేపథ్యంలో మరోసారి వార్తల్లోకెక్కిన సినీ నటి కరాటే కల్యాణి మీడియా సమావేశంలో మాట్లాడారు. మీడియాలో తనపై అసత్య కథనాలు వస్తున్నాయని, సినిమా వాళ్లకు చిన్నారిని అమ్ముకున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజంలేదని కరాటే కల్యాణి స్పష్టం చేశారు.
మౌక్తిక అనే చిన్నారిని తాను ఇంకా దత్తత తీసుకోలేదని, పాపకు ఇంకా ఏడాది కూడా నిండలేదని వెల్లడించారు. లీగల్ గా చెల్లుబాటు కాకపోవడంతో ఇంకా దత్తత తీసుకోలేదని, త్వరలోనే ఆ ప్రక్రియ పూర్తిచేస్తానని వివరించారు.
తాను ఎక్కడికీ పారిపోలేదని అన్నారు. తాను పారిపోయే రకం కాదని, పరిగెత్తించే రకం అని కరాటే కల్యాణి ఉద్ఘాటించారు. కావాలనే తనపై ఫిర్యాదులు చేస్తున్నారని, దీనివెనుక శివశక్తి అనే సంస్థ ఉందని ఆరోపించారు. కరాటే కల్యాణి మీడియా సమావేశంలో చిన్నారి తల్లిదండ్రులతో కలిసి పాల్గొన్నారు.
కరాటే కల్యాణి అక్రమంగా పాపను దత్తత తీసుకుందంటూ ఫిర్యాదులు అందాయి. దాంతో చైల్డ్ వెల్ఫేర్ శాఖ అధికారులు కరాటే కల్యాణి నివాసంలో సోదాలు జరిపారు. కరాటే కల్యాణి అక్రమంగా దత్తత తీసుకున్నట్టు తేలితే మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.