ప్రధాని నరేంద్ర మోదీ 'అచ్చే దిన్'పై కేటీఆర్ వ్యంగ్యాస్త్రం
- మోదీ అచ్చే దిన్ పిలుపునకు 8 ఏళ్లు
- ఈ 8 ఏళ్లలో ఏం సాధించారో చెబుతూ కేటీఆర్ ట్వీట్
- గ్యాస్ ధరలు ప్రపంచంలోకెల్లా భారత్లోనే అధికమని వ్యాఖ్య
అచ్చే దిన్ అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు నేటితో 8 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ కాసేపటి క్రితం వ్యంగ్యంగా విమర్శలు చేశారు. మోదీ అచ్చే దిన్కు 8 ఏళ్లు నిండాయన్న కేటీఆర్... ఈ 8 ఏళ్లలో మోదీ సర్కారు సాధించిందేమిటి అన్న వాటిని ప్రస్తావిస్తూ కేటీఆర్ ట్వీట్ సంధించారు.
ఈ 8 ఏళ్లలో రూపాయి విలువ అత్యంత కనిష్ఠ స్థాయికి చేరిందన్న కేటీఆర్...45 ఏళ్లలో అత్యధిక నిరుద్యోగం దాపురించిందని పేర్కొన్నారు. ఇక 30 ఏళ్ల గరిష్ఠానికి ద్రవ్యోల్బణం చేరిందని, ప్రపంచంలోనే అత్యధిక ఎల్పీజీ ధరలు దేశంలోనే ఉన్నాయని ఆయన తెలిపారు. 42 ఏళ్లలో అత్యంత దారుణ స్థితికి ఆర్థిక వ్యవస్థ దిగజారిందని కేటీఆర్ పేర్కొన్నారు.