అనుకున్న సమయానికే... భారత్ లో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు
- బంగాళాఖాతంలో అండమాన్ దీవుల వరకు విస్తరణ
- ఈ నెలాఖరుకు కేరళలో ప్రవేశించనున్న రుతుపవనాలు
- జూన్ మొదటివారం నాటికి తెలంగాణను తాకే అవకాశం
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- ఏపీ, తెలంగాణకు వర్ష సూచన
భారతదేశంలో అత్యధిక వర్షపాతం కలిగించేవి నైరుతి రుతుపవనాలు. తాజాగా, నైరుతి రుతుపవనాలు దేశంలో ప్రవేశించాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని తెలిపింది. దక్షిణ బంగాళాఖాతం మీదుగా అండమాన్ దీవుల వరకు ఇవి విస్తరించినట్టు ఐఎండీ వివరించింది.
కాగా, నైరుతి రుతుపవనాలు మే నెలాఖరు నాటికి కేరళను తాకుతాయని, తెలంగాణలో జూన్ మొదటివారంలో వీటి ప్రవేశం ఉంటుందని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు సాధారణ వర్షపాతాన్ని అందిస్తాయని ఐఎండీ గతంలో ఇచ్చిన నివేదికలో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, నైరుతి సీజన్ పై రైతాంగం గట్టి ఆశలు పెట్టుకుంది.
తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన
నైరుతి బంగాళాఖాతం, దక్షిణ తమిళనాడుకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఐఎండీ వెల్లడించింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఏపీలో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోనూ... తెలంగాణలోనూ అనేక చోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.