'సౌత్ ఇండియా షాపింగ్ మాల్' సహా మూడు మాల్స్ కు బాంబు బెదిరింపులు
- 3 షాపింగ్ మాల్స్‌కు బాంబు బెదిరింపులు
- రెండు గంటలకు పైగా తనిఖీలు చేపట్టిన పోలీసులు
- ఆకతాయి పనిగానే నిర్ధారణ
- పోలీసుల అదుపులో నిందితుడు
వస్త్ర వ్యాపారంలో ప్రముఖ సంస్థగా ఎదిగిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సహా అదే రంగంలోని మరో రెండు సంస్థలు మాంగళ్య, వీఆర్‌కే సిల్క్స్ మాల్‌లకు సోమవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. కరీంనగర్‌లోని ఈ సంస్థల షాపింగ్ మాల్స్‌లో బాంబులు పెట్టినట్లు ఓ వ్యక్తి ఆయా సంస్థల ప్రతినిధులకు ఫోన్ చేశాడు. ఈ మాట విన్నంతనే వణికిపోయిన ఆ సంస్థల ప్రతినిధులు పోలీసులకు సమాచారం అందించాయి.
బాంబు బెదిరింపుల వార్తలతో మూడు షాపింగ్ మాల్స్‌లో డాగ్ స్క్వాడ్‌లతో పోలీసులు సోదాలు చేపట్టారు. దాదాపుగా రెండు గంటలకు పైగా తనిఖీలు చేసినా ఎలాంటి బాంబులు కనిపించలేదు. దీంతో ఈ బెదిరింపులు ఆకతాయిల పనేనని పోలీసులు తేల్చారు. ఆ తర్వాత నిందితుడి చేసిన ఫోన్ ఆధారంగా అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.