సైమండ్స్ ను కాపాడేందుకు సీపీఆర్ కూడా చేశాను.. కానీ ప్రయోజనం దక్కలేదు: ప్రత్యక్ష సాక్షి
- రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సైమండ్స్
- వేగంగా వచ్చిన కారు డివైడర్ ను ఢీకొట్టి బోల్తా కొట్టిందన్న ప్రత్యక్ష సాక్షి
- సైమండ్స్ అక్కడికక్కడే చనిపోయాడని వెల్లడి
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ క్వీన్స్ లాండ్ లోని టౌన్స్ విల్లేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. గత శనివారం రాత్రి ఆయన మృతి చెందారు. ఈ ప్రమాదంపై పోలీసులు జరుపుతున్న విచారణలో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. సైమండ్స్ అక్కడికక్కడే మృతి చెందాడని ప్రత్యక్ష సాక్షి వేలాన్ టౌన్సన్ తెలిపాడు.
ప్రమాదం జరిగిన వెంటనే ఆయనను కాపాడేందుకు తాను ఎంతో ప్రయత్నించానని టౌన్సన్ తెలిపాడు. తన కళ్ల ముందే కారు ప్రమాదం జరిగిందని చెప్పాడు. అత్యంత వేగంతో ఉన్న సైమండ్స్ కారు డివైడర్ ను ఢీకొట్టి బోల్తా కొట్టిందని అన్నారు. ఆయన అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయాడని చెప్పారు.
కారులో చిక్కుకుపోయిన సైమండ్స్ ను కాపాడేందుకు చాలా ప్రయత్నించానని... సీపీఆర్ కూడా చేశానని... అయినా ప్రయోజనం లేకపోయిందని తెలిపారు. ప్రమాద సమయంలో కారులో రెండు కుక్కలు ఉన్నాయని... ఒక కుక్క రోదిస్తూ ఎవరినీ దగ్గరకు కూడా రానివ్వలేదని చెప్పారు. కుక్కలకు ఎలాంటి ప్రమాదం జరగలేని... రెండూ క్షేమంగా ఉన్నాయని తెలిపారు. ప్రమాదానికి గురైన వ్యక్తి సైమండ్స్ అని తనకు తెలియదని అన్నాడు.