ద కశ్మీర్ ఫైల్స్‌పై నిషేధం విధించాలి: ఫరూక్ అబ్దుల్లా
- కశ్మీరీ పండిట్లపై జరిగిన దారుణాల ఆధారంగా చిత్రం
- దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా వుందన్న ఫరూక్
- కల్పిత కథనాల ఆధారంగానే సినిమా తీశారని ఆరోపణ
బాలీవుడ్‌లో కాసుల వర్షం కురిపించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న ద కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని నిషేధించాలని నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కశ్మీర్‌లోని అనంతనాగ్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన ద కశ్మీర్ ఫైల్స్‌పై కీలక ఆరోపణలు చేశారు.
కశ్మీరీ పండిట్లపై జరిగిన దారుణాలే ఇతివృత్తంగా బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ద కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి దేశంలోని పలు రాష్ట్రాలు పన్ను మినహాయింపును సైతం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఆది నుంచి వ్యతిరేకంగానే ఉన్న ఫరూక్ అబ్దుల్లా తాజాగా ఆ సినిమాపై ఏకంగా నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా సినిమా ఉందని, కల్పిత కథనాల ఆధారంగానే ఈ సినిమాను తెరకెక్కించారని అబ్దుల్లా ఆరోపించారు.