ఉచిత విద్యుత్ ఎత్తివేసే కుట్రలో భాగమే మోటార్లకు మీటర్లు: ధూళిపాళ్ల నరేంద్ర కుమార్
- మీటర్లు బిగించడం ఎందుకు?.. రాయితీ ఇవ్వడం ఎందుకు? అన్న ధూళిపాళ్ల
- కేంద్ర ప్రభుత్వానికి వైసీపీ దాసోహమైందని విమర్శ
- తెలంగాణ వ్యతిరేకించినా ఏపీ ఆమోదం ఎందుకన్న ధూళిపాళ్ల
వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు అమర్చడం వెనుక ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర దాగుందని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే థూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆరోపించారు. ఈ మేరకు సోమవారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. మోటార్లకు మీటర్ల బిగింపుతో వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి దాసోహమైందని ఆయన ఆరోపించారు.
వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు బిగించడం ఎందుకు? రైతులకు రాయితీ ఇవ్వడం ఎందుకని ధూళిపాళ్ల ప్రశ్నించారు. ఇదంతా చూస్తుంటే రైతులకు ఉచిత విద్యుత్ పథకాన్ని ఆపేస్తారన్న కుట్రలా కనిపిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. పొరుగు రాష్ట్రం తెలంగాణ వ్యవసాయ మోటార్లకు మీటర్లను బిగించేది లేదని చెబుతున్నా... వైసీపీ ప్రభుత్వం మీటర్ల బిగింపునకు ఎందుకు ఒప్పుకుందని ప్రశ్నించారు.