రణవీర్ సింగ్, మహేశ్ బాబుల్లో వీకెండ్ కింగ్ ఎవరో చెప్పిన రామ్ గోపాల్ వర్మ

రణవీర్ సింగ్, మహేశ్ బాబుల్లో వీకెండ్ కింగ్ ఎవరో చెప్పిన రామ్ గోపాల్ వర్మ
  • ఈ నెల 12న రిలీజైన సర్కారు వారి పాట
  • బాలీవుడ్ లోనూ మహేశ్ చిత్రం హవా
  • మే 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన జయేష్ భాయ్ జోర్దార్
  • హీరోగా నటించిన రణవీర్ సింగ్
  • రెండు చిత్రాల కలెక్షన్లు వెల్లడించిన వర్మ
దక్షిణాది సినిమాలకు ఇప్పుడు దేశంలో మహర్దశ నడుస్తోంది. ఇటీవల వచ్చిన పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 నుంచి తాజాగా రిలీజైన సర్కారు వారి పాట చిత్రం వరకు బాలీవుడ్ లోనూ దుమ్మురేపుతున్నాయి. సౌత్ సినిమాలు వస్తున్నాయంటే చాలు... బాలీవుడ్ ఫిలింమేకర్లు తమ చిత్రాలను విడుదల చేసుకోవడానికి ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ధైర్యం చేసి దక్షిణాది సినిమాలతో పోటీగా విడుదల చేసిన బాలీవుడ్ సినిమాలు సోదిలో కూడా లేకుండా పోయాయి. 

తాజాగా, టాలీవుడ్ నుంచి మహేశ్ బాబు 'సర్కారు వారి పాట' చిత్రం రిలీజ్ కాగా, బాలీవుడ్ నుంచి రణవీర్ సింగ్ నటించిన 'జయేష్ భాయ్ జోర్దార్' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక్కరోజు తేడాతో రిలీజైన ఈ రెండు చిత్రాల వీకెండ్ కలెక్షన్లను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు. 

రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన 'జయేష్ భాయ్ జోర్దార్' తొలి వారాంతంలో రూ.11.75 కోట్లు మాత్రమే వసూలు చేసిందని వర్మ తెలిపారు. అదే సమయంలో మహేశ్ బాబు సర్కారు వారి పాట చిత్రం రూ.135 కోట్ల మేర వసూళ్లు రాబట్టిందని వివరించారు. 

ఆసక్తికర అంశం ఏమిటంటే.... ఈ ట్వీట్ పై ప్రముఖ ఫిలిం క్రిటిక్, ట్రేడ్ అనలిస్ట్ కమాల్ ఆర్ ఖాన్ స్పందించాడు. 11.75 కోట్లు కూడా వట్టిదేనని, నిజానికి జయేష్ భాయ్ జోర్దార్ వసూలు చేసింది రూ.10 కోట్లు కూడా ఉండదంటూ మరింత గాలి తీసేశాడు.


More Telugu News