మ‌హానాడు నిర్వ‌హ‌ణ‌కు ఒంగోలు మినీ స్టేడియం ఇవ్వాల‌న్న టీడీపీ... కుద‌ర‌ద‌న్న ప్ర‌భుత్వం

  • ఈ నెల 27, 28 తేదీల్లో మ‌హానాడు
  • ఒంగోలులో నిర్వ‌హించాల‌ని ఇదివ‌ర‌కే నిర్ణ‌యం
  • మ‌హానాడు ఏర్పాట్ల‌పై స‌మీక్షించిన చంద్ర‌బాబు
  • ఒంగోలు మినీ స్టేడియాన్ని ఇవ్వ‌క‌పోవ‌డంపై చంద్ర‌బాబు ఆగ్ర‌హం
  • న‌గ‌ర స‌మీపంలోని మండ‌వారిపాలెంలో మ‌హానాడు
టీడీపీ వార్షిక పండుగ మ‌హానాడును ఈ ఏడాది ఒంగోలులో నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వ‌హించ‌నున్న ఈ వేడుక కోసం న‌గ‌రంలోని ఒంగోలు మినీ స్టేడియాన్ని ఇవ్వాలని టీడీపీ కోర‌గా.. ప్ర‌భుత్వం అందుకు నిరాక‌రించింది. అవ‌స‌ర‌మైన ఫీజు చెల్లించ‌డంతో పాటుగా ముందుగానే సంప్ర‌దించినా కూడా అధికారులు స్టేడియాన్ని కేటాయించేందుకు స‌సేమిరా అన్నారు. దీనిపై సోమ‌వారం జ‌రిగిన మ‌హానాడు ఏర్పాట్ల‌పై జ‌రిగిన‌ స‌మీక్ష‌లో పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఒంగోలు మినీ స్టేడియాన్ని మ‌హానాడుకు ఇచ్చేందుకు ప్ర‌భుత్వం నిరాక‌రించ‌డంతో వేడుక‌ను ఒంగోలు స‌మీపంలోని మండ‌వారిపాలెంలో నిర్వ‌హించాల‌ని పార్టీ నిర్ణ‌యించింది. స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో ఏర్పాట్ల‌ను శ‌ర‌వేగంగా చేప‌ట్టాల‌ని పార్టీ నేత‌ల‌కు చంద్ర‌బాబు సూచించారు.


More Telugu News