స్టార్ కిడ్స్ పై మరోసారి విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్
- దక్షిణాది నటులు ప్రేక్షకులతో బాగా కనెక్ట్ అవుతారన్న కంగన
- స్టార్ కిడ్స్ ఉడకబెట్టిన కోడిగుడ్ల వంటి వారంటూ వ్యాఖ్య
- వాళ్లు తినే విధానం, మాట్లాడే తీరు అంతా డిఫరెంట్ గా ఉంటుందన్న కంగన
ఏ విషయం గురించైనా సరే కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ముందు వరుసలో ఉంటారు. బాలీవుడ్ లో నెలకొన్న నెపోటిజం (బంధుప్రీతి), స్టార్ కిడ్స్ పై ఆమె ఎప్పటి నుంచో విమర్శలు గుప్పిస్తున్నారు. అలియాభట్, హృతిక్ రోషన్, కరణ్ జొహార్ తదితర ప్రముఖులపై నేరుగా కామెంట్లు చేశారు. తాజాగా మరోసారి ఆ అంశంపై ఆమె మాట్లాడారు.
దక్షిణాది నటులు ప్రేక్షకులతో బాగా కనెక్ట్ అవుతారని... ప్రేక్షకులను అంత కంటే ఎక్కువగా చూస్తారని కంగన చెప్పారు. బాలీవుడ్ స్టార్ కిడ్స్ విదేశాల్లో చదువుకుని వస్తారని, హాలీవుడ్ సినిమాలను మాత్రమే వాళ్లు చూస్తారని అన్నారు. చేత్తో కాకుండా ఫోర్క్ లు, కత్తులతో తినే అలవాటు వారిదని... వారు మాట్లాడే విధానం కూడా ప్రత్యేకంగా ఉంటుందని చెప్పారు. ఇలాంటి వాళ్లు ప్రేక్షకులకు ఎక్కడ కనెక్ట్ అవుతారని ప్రశ్నించారు. అందుకే వీళ్లంతా ప్రేక్షకులకు ఉడకబెట్టిన కోడిగుడ్ల మాదిరి విచిత్రంగా కనిపిస్తారని ఎద్దేవా చేశారు.
'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ పాత్రను చూస్తే.. అందరికీ తెలిసిన వ్యక్తిలా ఆ పాత్ర ఉంటుందని... అందుకే ప్రతి కార్మికుడు ఆ పాత్రతో కనెక్ట్ అవుతాడని కంగన అన్నారు. ఇప్పుడున్న బాలీవుడ్ హీరోల్లో ఎవరైనా కూలీగా కనిపించేందుకు ఇష్టపడతాడా? అని ప్రశ్నించారు. సంస్కృతిని, వాస్తవాలను ప్రతిబింబించేలా దక్షిణాది సినిమాలు ఉంటాయని... అందుకే ఈ సినిమాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని చెప్పారు.