80 శాతం ఢిల్లీ ఆక్రమణల్లోనే వుంది: కేజ్రీవాల్
- బుల్డోజర్లు తిరిగితే.. 63 లక్షల మంది ఆశ్రయం కోల్పోతారన్న ఢిల్లీ సీఎం
- ప్రజలు పేపర్లు చూపిస్తున్నా కూల్చేస్తున్నారని ఆరోపణ
- ఇది సరికాదన్న కేజ్రీవాల్
ఢిల్లీలో ప్రజల షాపులు, ఇళ్లను బీజేపీ బుల్డోజర్లతో కూల్చివేయడం సరికాదని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. స్వతంత్ర భారత్ లో దీన్ని అతిపెద్ద విధ్వంసంగా ఆయన పేర్కొన్నారు. 63 లక్షల మంది ప్రజల ఇళ్లు, షాపులు బుల్డోజర్ల కారణంగా కూల్చివేతకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు.
సోమవారం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మీడియా సమావేశం నిర్వహించారు. ‘‘మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఢిల్లీలో ఆక్రమణలను బుల్డోజర్లతో కూల్చేస్తోంది. ఇక్కడ రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఒకటి ఢిల్లీలో 80 శాతం ఆక్రమణల పరిధిలోకే వస్తోంది. ప్రజలు పేపర్లు చూపించిన తర్వాత కూడా బుల్డోజర్లతో కూల్చేస్తుండడం రెండో అంశం. ఢిల్లీలో శాంతి కాలనీలు, మురికివాడలను తొలగించాలన్నది వారి ఆలోచన’’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. మురికివాడల్లో ఉన్నవారికి ఇళ్లు సమకూరుస్తామని చెప్పిన బీజేపీ దానికి బదులు ఇళ్లను కూల్చేస్తోందన్నారు.