సంచలనం.. జ్ఞానవాపి మసీదు బావిలో శివలింగం.. న్యాయవాది ప్రకటన
- ముగిసిన మూడు రోజుల సర్వే
- బావిలో శివలింగం ఉన్నట్టు న్యాయవాది విష్ణు జైన్ ప్రకటన
- రక్షణ కోరుతూ కోర్టుకు వెళ్లాలని నిర్ణయం
కోర్టు ఆదేశాల మేరకు కాశీలోని విశ్వనాథుని ఆలయం పక్కనే ఉన్న ప్రముఖ జ్ఞానవాపి మసీదులో విచారణ సోమవారం ముగిసింది. వీడియోగ్రఫీ మధ్య విచారణ పూర్తి చేశారు. తొలుత వీడియోలు తీసేందుకు, మసీదు ఆవరణ లోపలకు వచ్చేందుకు మసీదు నిర్వహణ కమిటీ అనుమతించలేదు. దీంతో కోర్టు మరోసారి ఆదేశాలు జారీ చేయడంతో, గట్టి బందోబస్తు మధ్య మూడు రోజుల్లో (శనివారం నుంచి సోమవారం వరకు) పరిశీలన పూర్తి చేశారు. కోర్టు నియమించిన కమిషనర్, న్యాయవాదుల బృందం ఈ పనిని పూర్తి చేసింది.
మసీదు లోపలి బావిలో శివలింగాన్ని కనుగొన్నట్టు న్యాయవాది విష్ణు జైన్ ప్రకటించారు. రక్షణ కోరుతూ సివిల్ కోర్టును ఆశ్రయించనున్నట్టు ఆయన ప్రకటించారు. కాశీ విశ్వనాథుని ఆలయాన్ని ఆనుకుని ఉన్నదానిని జ్ఞానవాపి-శృంగార్ గౌరీదేవి కాంప్లెక్స్ గా పిలుస్తారు. ఇందులోనే మసీదు కూడా ఉంది. ఈ కాంప్లెక్స్ పశ్చిమాన హిందూ ఆలయాన్ని ధ్వసం చేసిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ రోజువారీ ప్రార్థనలకు అనుమతించాలని, హిందూ దేవతల ఆనవాళ్లను తేల్చాలని కోరుతూ కొందరు మహిళలు వారణాసి జిల్లా కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా ఈ సర్వే జరిగింది.