చల్లటి కబురు.. రానున్న 24 గంటల్లో భారత్ లో ప్రవేశించనున్న నైరుతి రుతుపవనాలు!
- 24 గంటల్లో అండమాన్ నికోబార్ దీవుల్లోకి ప్రవేశించనున్న రుతుపవనాలు
- నెలాఖరులోగా కేరళను తాకనున్న వైనం
- జూన్ 8 నాటికి తెలంగాణలోకి ప్రవేశించనున్న రుతుపవనాలు
భారీ ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న జనాలకు వాతావరణ శాఖ చల్లటి కబురును అందించింది. రానున్న 24 గంటల్లో ఇండియాలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వెల్లడించింది. అండమాన్ నికోబార్ దీవులకు రుతుపవనాలు వస్తాయని తెలిపింది. ఆ తర్వాత బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో రుతుపవనాలు విస్తరిస్తాయని.... ఈ నెలఖరులోగా కేరళను తాకుతాయని చెప్పింది. జూన్ 8వ తేదీ లోగా తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని తెలిపింది. మరోవైపు నిన్న రాత్రి హైదరాబాదులో భారీ వర్షం కురిసింది.