సర్ అర్థర్ కాటన్‌కు నివాళి అర్పించిన చంద్రబాబు
- నేడు కాటన్ జయంతి
- అపర భగీరథుడు అన్న చంద్రబాబు
- ట్విట్టర్ వేదికగా నివాళి అర్పించిన టీడీపీ అధినేత
ఆంగ్ల పాలనలో జనరల్ గా పనిచేసి గోదావరి జిల్లాలకు జల సిరులు అందించిన సర్ అర్థర్ కాటన్ సేవలను టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆదివారం గుర్తు చేసుకున్నారు. సర్ అర్థర్ కాటన్ జయంతిని పురస్కరించుకుని ఆయనకు నివాళి అర్పించిన చంద్రబాబు ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లు చేశారు.
ఈ ట్వీట్లలో కాటన్‌ను అపర భగీరథుడిగా చంద్రబాబు అభివర్ణించారు. నాడు కరవుతో అల్లాడే గోదావరి నదీతీర ప్రాంతాలను ఆనకట్ట కట్టడం ద్వారా సస్యశ్యామలం చేసిన మహనీయుడు కాటన్ అంటూ చంద్రబాబు పేర్కొన్నారు. ఆంగ్లేయుడైనా తరతరాలకు తరగని జలసిరులు అందించిన సర్ ఆర్థర్ కాటన్‌ను గోదావరి జిల్లాల వాసులు పూజిస్తారని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ధాన్యాగారంగా రూపొందడానికి ప్రధాన కారకుడైన కాటన్ చిరస్మరణీయుడంటూ చంద్రబాబు నివాళి అర్పించారు.