స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు చెమటోడ్చిన గుజరాత్
- 19.1 ఓవర్లలో 137 పరుగులు చేసిన గుజరాత్
- బ్యాటును ఝుళిపించిన వృద్ధిమాన్ సాహా
- అలవోకగా గెలవాల్సిన మ్యాచ్‌ను ఎదురీదిన గుజరాత్
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు గుజరాత్ టైటాన్స్ జట్టు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఆదివారం డబుల్ హెడర్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ కు దిగి 133 పరుగులు చేసిన చెన్నై జట్టు...గుజరాత్‌కు 134 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది.
లక్ష్య ఛేదనలో గుజరాత్ బ్యాటర్లు బాగా తడబడ్డారు. నిర్ణీత 20 ఓవర్ల వరకు బ్యాటింగ్ చేసిన గుజరాత్ చివరి ఓవర్ తొలి బంతికి విజయలక్ష్యాన్ని ఛేదించింది. 3 వికెట్లను కోల్పోయిన గుజరాత్ 137 పరుగులు చేసింది. గుజరాత్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన వృద్ధిమాన్ సాహా (67) పరుగులతో సత్తా చాటాడు. శుభ్‌మన్ గిల్ (18), మాథ్యూ వేడ్ (20), డేవిడ్ మిల్లర్ (15) పరుగులు చేయగా... గుజరాత్ విక్టరీ సాధించింది.