కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా పాదయాత్ర: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ
- బారత్ జోడో యాత్ర పేరిట పాదయాత్ర
- అక్టోబర్ 2 నుంచి ప్రారంభం
- మళ్లీ పుంజుకుంటామన్న సోనియా గాంధీ
భారత్ జోడో యాత్ర పేరిట కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా పాదయాత్ర చేపట్టనున్నట్లు కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కీలక ప్రకటన చేశారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా మూడు రోజులుగా సాగుతున్న నవ సంకల్ప్ చింతన్ శిబిర్ సదస్సులో ముగింపు ఉపన్యాసం చేసిన సందర్భంగా సోనియా గాంధీ ఈ ప్రకటన చేశారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 నుంచి ఈ యాత్రను చేపట్టనున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ యాత్రలో పార్టీకి చెందిన సీనియర్ నేతలతో పాటు జూనియర్ నేతలు అంతా పాలుపంచుకుంటారని ఆమె వెల్లడించారు.
దేశంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి బలోపేతం అవుతుందని సోనియా గాంధీ చెప్పారు. మళ్లీ పుంజుకుంటామని చెప్పిన సోనియా... అదే తమ సంకల్పమంటూ ప్రకటించారు. పార్టీ బలోపేతానికి చింతన్ శిబిర్ ఎంతగానో దోహదపడుతుందని భావిస్తున్నామని ఆమె తెలిపారు. పార్టీ పుంజుకునేందుకు నేతలు చేసిన సిఫారసులపై త్వరితగతిన చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.