ఎలక్ట్రిక్ వాహనం కొంటే పన్ను ప్రయోజనాలు
- విక్రయంపై 5శాతానికి జీఎస్టీ ని తగ్గించిన రాష్ట్రాలు
- ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80ఈఈబీ కింద అదనపు ప్రయోజనం
- ఈవీ రుణానికి చేసే వడ్డీ చెల్లింపులపై రాయితీ క్లెయిమ్ చేసుకోవచ్చు
- ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1. 5లక్షల వరకు
పర్యావరణానికి అనుకూలం, నిర్వహణ వ్యయం ఆదా.. ఈ ప్రయోజనాలను చూసి ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్ లు, కార్లను (ఈవీలు) కొనుగోలు చేసే వారు పెరుగుతున్నారు. ముఖ్యంగా వ్యక్తిగత వాహన విభాగంలో ద్విచక్ర, కార్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. ఈవీలను కొనుగోలు చేయడం వల్ల వీటిటోపాటు పన్ను ఆదా ప్రయోజనం కూడా ఉంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతోపాటు గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఇప్పటికే పలు విధానాలను ప్రకటించాయి. జీఎస్టీని గతంలో ఉన్న 12 శాతం నుంచి 5 శాతానికి రాష్ట్ర పభుత్వాలు తగ్గించాయి. ఈవీల కొనుగోలుకు రుణం తీసుకుంటే.. ఆ రుణంపై ఒక ఆర్థిక సంవత్సరంలో చెల్లించే వడ్డీ రూ.1.5 లక్షల వరకు ఆదాయపన్ను చెల్లించక్కర్లేదు. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80ఈఈబీ కింద ఈ ప్రయోజనాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది.
ఈ ప్రయోజనం పొందడానికి కొన్ని షరతులు పాటించాలి. అప్పటి వరకు ఒక్క ఈవీ కూడా తమ పేరిట కొనుగోలు చేసి ఉండకూడదు. అంటే మొదటిసారి ఈవీ కొనుగోలుకు, తీసుకునే రుణం వడ్డీపైనే పన్ను ప్రయోజనం లభిస్తుంది. బ్యాంకులు లేదా ఆర్బీఐ నమోదిత ఎన్బీఎఫ్ సీల నుంచి తీసుకుంటేనే ఈ ప్రయోజనం దక్కుతుంది. వ్యక్తులకే కానీ, వ్యాపార సంస్థలు ఈవీల కొనుగోలుపై ఈ ప్రయోజనం లేదు.