దేశంలో ఎన్నికలకు వెళ్లేందుకు బీజేపీ సిద్ధమా?: తలసాని
- కేంద్రంలో అధికారంలో ఉన్నామని షా ఏది పడితే అది మాట్లాడకూడదన్న తలసాని
- కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్
- అమిత్ షా చేస్తోన్న వ్యాఖ్యలు సరికాదని వ్యాఖ్య
కేంద్ర మంత్రి అమిత్ షాపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్నామని ఏది పడితే అది మాట్లాడుతామంటే కుదరదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి దేశ వ్యాప్తంగా ఎన్నికలకు వెళ్లేందుకు బీజేపీ సిద్ధమా అని ఆయన ప్రశ్నించారు. కేంద్రమంత్రి హోదాలో ఉన్న అమిత్ షా చేస్తోన్న వ్యాఖ్యలు సరికాదని ఆయన అన్నారు. గుజరాత్‌లో డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎందుకు నిర్మించలేదని ఆయన నిలదీశారు.
తెలంగాణ ప్రజలంతా టీఆర్‌ఎస్ వైపే ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో తమ ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేసిందని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ ముందుచూపు వల్లే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇళ్లను అర్హులకే కేటాయిస్తున్నామని, ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తోందని ఆయన అన్నారు.