పేగులు ఆరోగ్యంగా ఉంటేనే.. ఆనందంగా ఉంటాం..!
- తీసుకున్న ఆహారం ఒంటికి పట్టాలంటే పేగులదే ముఖ్యపాత్ర
- సాఫీ జీర్ణంలో, పోషకాలు అందించడంలో కీలకం
- కొన్ని లక్షణాల ఆధారంగా పేగుల ఆరోగ్యం అంచనా
- వైద్యుల సూచనలతో మార్పులు చేసుకుంటే చాలు
మన జీర్ణ వ్యవస్థలో పేగులు ముఖ్య భూమిక పోషిస్తుంటాయి. ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలను శరీరం సంగ్రహించడానికి పేగులే కీలకంగా పనిచేస్తాయి. పేగులు ఆరోగ్యంగా ఉన్నట్టయితే తినే ఆహారం చక్కగా జీర్ణమై అందులోని పోషకాలు శరీరానికి అందుతాయి. ఇందుకు అవసరమైన మంచి బ్యాక్టీరియా పేగుల్లోనే ఉంటుంది. హానికారకాలు బయటకు పంపేందుకు, వ్యాధులపై పోరాడేందుకు పేగులు ఆరోగ్యంగా ఉండాలి.
కానీ, అనారోగ్యకరమైన జీవనశైలి, తీసుకునే ఆహారం (రసాయనాలు, పీచులేనివి) పేగుల ఆరోగ్యం బలహీనపడడానికి కారణమవుతున్నాయని నిపుణులు అంటున్నారు. ఎన్నో అంశాలు పేగుల ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంటాయి. ఇందుకు సంబంధించి ఎన్నో సంకేతాలు మనకు కనిపిస్తుంటాయి. మరి పేగులు ఆరోగ్యంగా ఉన్నదీ, లేనిదీ తెలుసుకోవడం ఎలా..?
ఆహారం రుచించకపోవడం
పేగుల్లో మంచి బ్యాక్టీరియా లోపించినప్పుడే ఆహారం పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. మంచి బ్యాక్టీరియా లోపిస్తే కొన్ని రకాల పదార్థాలు సరిగ్గా జీర్ణం కావు. ఇది ఆయా పదార్థాల పట్ల అయిష్టానికి దారితీస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్, డయేరియా, తల తిగరడం, కడుపులో నొప్పి ఇవన్నీ పేగుల్లో మంచి బ్యాక్టీరియా తగినంత లేదనడానికి లక్షణాలుగా చూడొచ్చు. పేగులు ఆరోగ్యం లేకపోవడం వల్ల అలసట కూడా కనిపిస్తుంది.
స్కిన్ ఇరిటేషన్
తీసుకున్న ఆహారం వల్ల లేదంటే కొన్ని రకాల అలెర్జీల వల్ల పేగుల్లో వాపు తలెత్తవచ్చు. అటువంటప్పుడు పేగుల నుంచి కొన్ని రకాల ప్రొటీన్ లు శరీరంలోకి విడుదల అవుతాయి. ఇవి చర్మంపై చికాకు, ఎక్జిమాకు దారితీస్తాయి.
నిద్ర సమస్యలు
మంచి నిద్ర పోలేకపోతున్నారా..? పేగులు ఆరోగ్యంగా లేకపోవడం వల్ల కూడా ఇలా జరగొచ్చు. పేగుల్లోని బ్యాక్టీరియా లేదంటే వాపు అన్నది నిద్ర అలవాట్లను ప్రభావితం చేస్తాయి.
తలనొప్పి
పేగుల ఆరోగ్యం, తలనొప్పికి మధ్య సంబంధం ఉంది. తలతిరగడం లేదంటే వాంతులు అన్నవి మైగ్రేయిన్ లో కనిపిస్తాయి. ఇటువంటి వారు ఒకసారి వైద్యుల వద్దకు వెళ్లి పేగుల ఆరోగ్యం గురించి పరీక్షించుకోవాలి. థైరాయిడ్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, మల్టిపుల్ స్కెలరోసిస్, ఆటో ఇమ్యూన్ వ్యాధులు పేగుల ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు పెరిగిపోతుంటాయి. కనుక ఈ తరహా లక్షణాలు ఉన్న వారు వైద్యుల సూచన తీసుకోవాలి.
ఆరోగ్యం పెంచుకునే మార్గం
పేగులు ఆరోగ్యంగా ఉండాలంటే.. యాంటీ బయోటిక్స్ ను అదే పనిగా, ఎక్కువ కాలం, తరచూ తీసుకోవద్దు. ప్రోబయోటిక్స్ వాడుకోవాలి. న్యూట్రిషనిస్ట్ సూచనలతో తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ఒత్తిడులు తగ్గించుకోవాలి. రోజువారీ వ్యాయామం చేయాలి. సరిపడా నీరు తీసుకోవాలి.