ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన క్రికెటర్ పృథ్వీషా

  • టైఫాయిడ్ తో బాఢపడుతున్న పృథ్వీషా
  • చికిత్స తర్వాత ఢిల్లీ జట్టు హోటల్ కు 
  • వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నట్టు ప్రకటించిన డీసీ
టైఫాయిడ్ జ్వరం బారిన పడిన టీమిండియా క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) జట్టు ఒపెనర్ పృథ్వీ షా చికిత్స అనంతరం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ ఆదివారం ప్రకటించింది. 

‘‘ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా టైఫాయిడ్ కు చికిత్స తీసుకున్న అనంతరం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. జట్టు ఉంటున్న హోటల్ కు తిరిగొచ్చాడు. జట్టు వైద్యుల బృందం పర్యవేక్షణలో ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు’’అంటూ ఢిల్లీ క్యాపిటల్స్ ప్రకటించింది.

ఢిల్లీ క్యాపిటల్స్ లీగ్ దశలో మిగిలిన రెండు మ్యాచుల్లోనూ పృథ్వీషా పాల్గొనే అవకాశం లేదని జట్టు అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్ సంకేతం ఇచ్చారు. ‘‘ఈ జ్వరం అంతర్లీనంగా గత కొన్ని వారాల నుంచి అతడిలో ఉంది. ఢిల్లీ తదుపరి మ్యాచ్ సోమవారం జరగనుంది. గ్రూపు దశలో ఫైనల్ మ్యాచ్ నాటికి  షా కోలుకోవచ్చు’’అని షేన్ వాట్సన్ తెలిపాడు. పృథ్వీషా లేని లోటు ఢిల్లీ క్యాపిటల్స్ ఆటలో స్పష్టంగా కనిపిస్తోంది. గత సీజన్ లో ప్లే ఆఫ్స్ కు వెళ్లిన ఈ జట్టు ఈ విడత ఏటికి ఎదురీదుతోంది.


More Telugu News