లక్షలాది చిన్న ఇన్వెస్టర్ల ఆశలను ఎల్ఐసీ షేరు నిలబెడుతుందా?
- 17న స్టాక్ ఎక్సేంజ్ ల్లో ఎల్ఐసీ లిస్టింగ్
- పెద్ద సంఖ్యలో పాల్గొన్న రిటైల్ ఇన్వెస్టర్లు
- అమ్మకాల ఒత్తిళ్లలో ఈక్విటీలు
- లాభం లేకపోగా.. నష్టం ఇస్తుందా..?
- ఇన్వెస్టర్లలో సందేహాలు
ఎల్ఐసీ ఐపీవో అనగానే లక్షలాది చిన్న ఇన్వెస్టర్లలో ఆశలు చిగురించాయి. బీమాలో దిగ్గజ సంస్థ కావడం, బాగా తెలిసిన పేరు కావడంతో.. లాభాలనే ఇస్తుందన్న నమ్మకంతో పెద్ద సంఖ్యలో చిన్న ఇన్వెస్టర్లు ఐపీవోకు దరఖాస్తు చేసుకున్నారు. మొదటిసారి డీమ్యాట్ ఖాతా తెరిచి ఎల్ఐసీ ఐపీవోకు అప్లయ్ చేసుకున్న వారు కూడా ఉన్నారు. మరి వీరందరికీ లిస్టింగ్ రోజు లాభాలు వస్తాయా..? నష్టాలు చవి చూడాల్సి వస్తుందా..?
ఎల్ఐసీ స్టాక్ ఎక్సేంజ్ ల్లో మంగళవారం లిస్ట్ కానుంది. గత అనుభవాలు పరిశీలిస్తే.. ప్రభుత్వరంగ బీమా సంస్థలైన న్యూ ఇండియా అష్యూరెన్స్, జీఐసీ ఆర్ఈ ఇన్వెస్టర్లకు లాభాలను తినిపించింది లేదు. బదులుగా నష్టాల్లో ఉన్నాయి. ఈ రెండు వాటి గరిష్ఠాల నుంచి 70 శాతం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. వీటిల్లో ఒకటి సాధారణ బీమా కంపెనీ అయితే, మరొకటి రీఇన్సూరెన్స్ సంస్థ. కానీ ఎల్ఐసీ జీవిత బీమాలో దిగ్గజం భారీ ఆస్తులు, లాభాలతో నడుస్తున్న పటిష్ట కంపెనీ కావడం గమనించాలి. 2010 నుంచి స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన ప్రభుత్వరంగ సంస్థల్లో సగం నష్టాలనే ఇచ్చాయి.
అయితే, భారత ఐపీవో చరిత్రలో అతిపెద్ద ఇష్యూలు ఎక్కువ శాతం ఇన్వెస్టర్లకు నష్టాలను పంచిన చరిత్ర ఉంది. మరి ఎల్ఐసీ కూడా భారత చరిత్రలోనే అతిపెద్ద ఐపీవో. కనుక పాత చరిత్రనే ఎల్ఐసీ కొనసాగిస్తుందా? చూడాలి. ఈ ఐపీవో ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.20,000కోట్లు సమకూర్చుకుంది. స్టాక్ మార్కెట్లో వాతావరణం కూడా అల్లకల్లోలం మాదిరిగా ఉంది. అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు, ద్రవ్యోల్బణం పెరిగిపోవడం వృద్ధికి గొడ్డలి పెట్టు అవుతుందని, సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచడం కూడా ఆర్థిక వ్యవస్థల రికవరీని ఆలస్యం చేస్తుందంటూ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరి మార్కెట్లో బుల్లిష్ వాతావరణం లేని సమయంలో ఎల్ఐసీ లిస్ట్ అవుతుండడాన్ని గమనించాలి. గ్రే మార్కెట్లో మాత్రం 30 రూపాయిల మైనస్ తో ట్రేడ్ అవుతోంది.
ఎల్ఐసీ 25 కోట్ల పాలసీ దారులతో, 28.6 కోట్ల పాలసీలతో, 2000 శాఖలతో, 10వేల బ్రాంచ్ లతో, 500 బిలియన్ డాలర్ల ఆస్తులతో దిగ్గజ సంస్థగా వెలుగుతోంది.