బీజేపీకి కొత్త అర్ధం చెప్పిన కేటీఆర్.. షా పర్యటనపై సెటైర్లు
- తెలంగాణలో పొలిటికల్ టూరిజం కొనసాగుతోందని వ్యాఖ్య
- మరో నేత వచ్చి, తిని వెళ్లారన్న కేటీఆర్
- బీజేపీ అంటే.. బక్వాస్ జుమ్లా పార్టీ అంటూ కొత్త భాష్యం
తెలంగాణలో రాజకీయ టూరిజం కొనసాగుతోందని, హైదరాబాద్‌కు మరో టూరిస్టు వచ్చి వెళ్లారంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ సెటైర్లు విసిరారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో గత రాత్రి బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభకు హాజరైన అమిత్ షా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కదిలి రావాలని యువతకు పిలుపునిచ్చారు.
అమిత్ షా పర్యటనపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో పొలిటికల్ టూరిజం కొనసాగుతోందని, మరో టూరిస్ట్ వచ్చి తిని వెళ్లారని అమిత్ షాను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. గత ఎనిమిదేళ్లలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదన్నారు. బీజేపీ అంటే బక్వాస్ జుమ్లా పార్టీ అని కేటీఆర్ కొత్త అర్థం చెప్పారు.