శరద్ పవార్‌పై మరాఠీ నటి అనుచిత వ్యాఖ్యలు.. అరెస్ట్
- నరకం వేచి చూస్తోంది అంటూ కేతకి పోస్టు
- అదుపులోకి తీసుకున్న థానే క్రైం బ్రాంచ్ పోలీసులు
- పోలీస్ స్టేషన్ బయట నల్ల ఇంకు, గుడ్లతో నటిపై దాడి
- ఆమె ఎవరో తనకు తెలియదన్న శరద్ పవార్
ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌పై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలపై మరాఠీ నటి కేతకి చితాలే (29)ను థానే పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఆమె ఫేస్‌బుక్‌లో ఓ పోస్టును షేర్ చేశారు. అందులో శరద్ పవార్ ఇంటిపేరును, వయసును ప్రస్తావిస్తూ.. ‘నరకం వేచి చూస్తోంది. బ్రాహ్మణులను మీరు అసహ్యించుకుంటున్నారు’ అని పేర్కొంది. అందులో శరద్ పవార్ పేరును పవార్ అని ఇంటి పేరును మాత్రమే ప్రస్తావించిన కేతకి.. వయసు 80 అని పేర్కొంది. కాగా, ప్రస్తుతం పవార్ వయసు 81 సంవత్సరాలు.
కేతకి చేసిన పోస్టుపై స్వప్నిల్ నెట్కే థానేలోని కల్వా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె శరద్ పవార్‌ను ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేశారని స్వప్నిల్ ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన థానే క్రైం బ్రాంచ్ పోలీసులు నవీ ముంబైలో కేతకి ను అరెస్ట్ చేశారు.
మరోవైపు, నిన్న సాయంత్రం నవీ ముంబైలోని కలంబొలి పోలీస్ స్టేషన్ బయట చితాలేపై ఎన్సీపీ మహిళా విభాగం కార్యకర్తలు నల్ల ఇంకు, గుడ్లతో దాడిచేశారు. అలాగే, పూణెలోనూ ఎన్సీపీ కార్యకర్త ఫిర్యాదుతో కేతకిపై కేసు నమోదైంది. కేతకి అనుచిత పోస్టు విషయమై నాందేడ్‌లో శరద్ పవార్ ను విలేకరులు ప్రశ్నించారు. కేతకి ఎవరో తనకు తెలియదని, సోషల్ మీడియాలో ఆమె ఏం రాసిందో కూడా తనకు తెలియదని పవార్ బదులిచ్చారు. అంతేకాదు, ఆమె ఏం చేసిందని, తనపై ఆమెకున్న ఫిర్యాదు ఏంటని విలేకరులను తిరిగి ప్రశ్నించారు. ఏం జరిగిందో తెలుసుకోకుండా స్పందించడం సరికాదని పవార్ చెప్పుకొచ్చారు.