త‌డ‌బ‌డ్డా మంచి స్కోరే చేసిన కోల్‌క‌తా!... హైద‌రాబాద్ ల‌క్ష్యం 178 ప‌రుగులు

  • టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌క‌తా
  • 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 177 ప‌రుగులు చేసిన నైట్ రైడ‌ర్స్‌
  • ఉమ్రాన్ మాలిక్‌కు 3 వికెట్లు
మ‌హారాష్ట్రలోని పూణే వేదికగా జ‌రుగుతున్న ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎంచుకున్న కోల్ కతా నైట్ రైడ‌ర్స్ బ్యాట‌ర్లు త‌డ‌బ‌డ్డా చివ‌రికి మంచి స్కోరే చేశారు. తొలుత వికెట్లు వ‌రుస‌గా ప‌డిన నేప‌థ్యంలో స్వ‌ల్ప స్కోరుకే చాప చుట్టేస్తుంద‌ని భావించిన కోల్ క‌తాను ఆండ్రూ ర‌స్సెల్ (49) ఆదుకున్నాడు. 

ఐదో నెంబరులో బ్యాటింగ్‌కు వ‌చ్చిన ర‌స్సెల్ 28 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్స్‌ల‌తో వీర విహారం చేశాడు. ఇక సామ్ బిల్లింగ్స్ (34), రెహానే (28), నితీష్ రాణా (26) పరుగులు కూడా తోడు కావ‌డంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో కోల్ క‌తా 6 వికెట్ల‌ను కోల్పోయి 177 ప‌రుగులు సాధించింది.

ఇక బౌలింగ్ విష‌యానికి వ‌స్తే.. టాస్ ఓడినా ఫ‌స్ట్ బౌలింగ్ అవ‌కాశం ద‌క్కించుకున్న హైద‌రాబాద్ జ‌ట్టు బౌలర్లు స‌త్తా చాటార‌నే చెప్పాలి. వ‌రుస‌గా వికెట్లు తీస్తూ కోల్ క‌తా బ్యాట‌ర్లు నిల‌దొక్కుకోకుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. జట్టు స్టార్ బౌల‌ర్ ఉమ్రాన్ మాలిక్ ఏకంగా 3 వికెట్లు తీసుకోగా... భువ‌నేశ్వ‌ర్‌, న‌ట‌రాజ‌న్‌, మార్కో జాన్స‌న్ త‌లో వికెట్ తీసుకున్నారు. 178 ప‌రుగుల విజ‌య‌ల‌క్ష్యంతో మ‌రికాసేప‌ట్లోనే హైద‌రాబాద్ త‌న ఇన్నింగ్స్‌ను ప్రారంభించనుంది.


More Telugu News