త్రిపుర సీఎం బిప్ల‌వ్ దేవ్ రాజీనామా

  • 2018లొ త్రిపుర సీఎంగా బిప్ల‌వ్ ప్ర‌మాణం
  • నాలుగేళ్లుగా స‌జావుగానే పాల‌న సాగించిన వైనం
  • బీజేపీ అధిష్ఠానం ఆదేశాల‌తోనే రాజీనామా అంటూ ప్ర‌చారం
  • కొత్త సీఎంను ఎంపిక చేయ‌నున్న బీజేపీ
ఈశాన్య రాష్ట్రం త్రిపుర‌లో రాజ‌కీయంగా శ‌నివారం ఓ కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. త్రిపుర సీఎం ప‌ద‌వికి బీజేపీ నేత బిప్ల‌వ్ కుమార్ దేవ్ కాసేప‌టి క్రితం రాజీనామా చేశారు. బీజేపీ అధిష్ఠానం ఆదేశాల మేర‌కే బిప్ల‌వ్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేసిన‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. 

2018లో త్రిపుర సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌గా... గ‌డ‌చిన నాలుగేళ్ల పాటు ఆయ‌న ప్ర‌భుత్వాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండానే న‌డిపించారు. అయితే కార‌ణాలేమిటో తెలియ‌దు గానీ... ఉన్న‌ట్టుండి ఆయ‌న సీఎం ప‌ద‌వికి రాజీనామా చేశారు, ఈ నేప‌థ్యంలో బిప్ల‌వ్ స్థానంలో త్రిపుర సీఎం ప‌ద‌వికి మ‌రో కొత్త నేత‌ను బీజేపీ అధిష్ఠానం ఎంపిక చేయ‌నుంది.


More Telugu News