రెండో రోజు కొన‌సాగుతున్న‌ చింత‌న్ శిబిర్... సోనియా నేతృత్వంలోని బృంద చర్చలో రేవంత్‌

  • ఉద‌య్‌పూర్‌లో చింత‌న్ శిబిర్‌
  • రెండో రోజూ కొన‌సాగుతున్న బృంద చర్చలు ‌
  • పార్టీ నిర్మాణంపై చ‌ర్చించిన వైనం
రాజ‌స్ధాన్‌లోని ఉద‌య్‌పూర్‌లో శుక్ర‌వారం ప్రారంభ‌మైన కాంగ్రెస్ పార్టీ మేధోమ‌థ‌న స‌ద‌స్సు న‌వ సంక‌ల్ప్ చింత‌న్ శిబిర్ రెండో రోజైన శ‌నివారం కూడా కొన‌సాగుతోంది. ఇందులో భాగంగా స‌మావేశానికి హాజ‌రైన నేత‌లంతా బృంద చర్చలలో ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నారు. 

శ‌నివారం జ‌రిగిన ఈ తరహా చర్చలో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఉత్సాహంగా క‌నిపించారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నేతృత్వంలో పార్టీ నిర్మాణంపై జ‌రిగిన బృంద చర్చలలో రేవంత్ రెడ్డి పాలుపంచుకున్నారు. ఆదివారం కూడా చింత‌న్ శిబిర్ కొన‌సాగనుంది.


More Telugu News