దీనికంటే అణు బాంబు వేయడం బెటర్: ఇమ్రాన్ ఖాన్
- ఇటీవలే ప్రధాని పదవి నుంచి బలవంతంగా దిగిపోయిన ఇమ్రాన్
- దేశాధికారం దొంగల చేతిలో ఉందని వ్యాఖ్య
- దొంగలు అన్ని వ్యవస్థలను నాశనం చేశారని విమర్శ
పాకిస్థాన్ ప్రధాని పదవి నుంచి ఇమ్రాన్ ఖాన్ బలవంతంగా దిగిపోవాల్సిన పరిస్థితి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని పగ్గాలను మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు షెహబాజ్ షరీఫ్ చేపట్టారు. ఈ క్రమంలో తాజాగా ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశాధికారాన్ని దొంగలకు అప్పగించడం కన్నా... దేశంపై అణు బాంబు వేయడం ఉత్తమమని అన్నారు.
తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అవినీతిపరులు ఇప్పుడు తనకు సలహాలు ఇవ్వాలనుకుంటున్నారని మండిపడ్డారు. ఈ నెల 20న ఇస్లామాబాద్ లో లాంగ్ మార్చ్ నిర్వహిస్తానని... తనను ఆపే శక్తి ఎవరికీ లేదని అన్నారు. అధికారంలోకి వచ్చిన దొంగలు అన్ని వ్యవస్థలను నాశనం చేశారని చెప్పారు. అధికారంలో ఉన్న నేరగాళ్ల కేసులను ఇప్పుడు ఏ అధికారి దర్యాప్తు చేస్తాడని ప్రశ్నించారు.