సీఎంగా వైఎస్సార్ ప్ర‌మాణం చేసి నేటికి 18 ఏళ్లు!... గుర్తు చేసుకున్న‌ వైఎస్ ష‌ర్మిల!

  • 2004 మే 14న ఏపీ సిఎంగా వైఎస్సార్ ప్ర‌మాణం
  • ఎల్బీ స్టేడియంలో భారీ వేడుక‌
  • తండ్రి పాల‌న‌ను గుర్తు చేసుకున్న వైఎస్ షర్మిల‌
దివంగ‌త నేత‌, ఉమ్మ‌డి రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా కొన‌సాగిన వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి... తొలి సారిగా సీఎం ప‌ద‌వి చేప‌ట్టి నేటికి స‌రిగ్గా 18 ఏళ్లు. 2004 మే 14న ఆయ‌న ఏపీకి తొలిసారి సీఎంగా ప‌ద‌వీ ప్ర‌మాణం చేశారు. నాడు హైద‌రాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన వేదిక మీద వైఎస్ సీఎంగా ప‌ద‌వీ ప్ర‌మాణం చేశారు. ఈ స‌న్నివేశం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల‌కు స‌రికొత్త ఉత్సాహం నింపితే... ఆ చిత్రం తెలుగు ప్ర‌జ‌ల గుండెల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకుంది. 

ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని వైఎస్సార్ త‌న‌య‌, వైఎస్సార్టీపీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల శ‌నివారం ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ పోస్ట్ పెట్టారు. సంక్షేమ పాలన అంటే వైఎస్సార్‌ ముందు, వైఎస్సార్‌ తరువాత అని చెప్పుకునేంతగా సుపరిపాలన అందించి జనం గుండెల్లొ శాశ్వతంగా నిలిచిన రాజశేఖర్ రెడ్డి... మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి నేటికి 18 ఏళ్లు అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో అని మనందరికి చాటి చెప్పినరోజు అంటూ ఆమె ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు.


More Telugu News