ఆరోగ్యం కోసం.. కూర్చోవడం కాస్త తగ్గిస్తే మంచిదంటున్న అధ్యయనం!
- రోజులో గంట పాటు నిశ్చలత్వాన్ని తగ్గించుకున్నా చాలు
- రక్తపోటు, రక్తంలో గ్లూకోజ్ నియంత్రణకు సాయం
- ఫిన్లాండ్ పరిశోధకుల అధ్యయనంలో గుర్తింపు
కదలికలు పెద్దగా లేని జీవనశైలితో ఆరోగ్యపరమైన ముప్పు ఉంటుందని తెలిసింది కొద్ది మందికే. అందుకని శరీరానికి తగినంత కదలికలు ఉండేలా చూసుకోవాలి. ఇలా చేస్తే ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఉన్నాయని.. జర్నల్ఆఫ్ సైన్స్ అండ్ మెడిసిన్ లో ప్రచురితమైన తాజా అధ్యయనం చెబుతోంది.
నిశ్చలమైన జీవనాన్ని రోజులో గంట తగ్గించలిగినా ఎంతో కొంత ఆరోగ్యానికి మంచి జరుగుతుందని ఈ అధ్యయనంలో తెలుసుకున్నారు. గుండె ఆరోగ్యం, టైప్-2 డయాబెటిస్ ముప్పు తగ్గుతుందని చెబుతున్నారు. పరిశోధకులు ఫిన్లాండ్ లో మధ్య వయసులో నిశ్చిలమైన జీవనాన్ని గుడుపుతున్న 64 మందిని (మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నవారు) ఎంపిక చేశారు. రెండు గ్రూపులుగా చేశారు.
ఒక గ్రూపులోని వారికి నిత్యం గంటపాటు కదలికలు ఉండేలా చూశారు. నించోవడం, అటూ ఇటూ కదలడం, స్వల్ప వ్యాయామాల్లాంటివి చేయించారు. మూడు నెలల పాటు పరిశీలించారు. రక్తపోటు, రక్తంలో గ్లూకోజును కూడా చెక్ చేశారు. దీంతో కదలికల్లేని గ్రూపులోని వారితో పోలిస్తే.. కనీసం గంటపాటు శారీరకంగా శ్రమించే వారికి బ్లడ్ షుగర్ నియంత్రణ, ఇన్సులిన్ సెన్సిటివిటీ, కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతున్నట్టు తెలుసుకున్నారు.
శారీరకంగా తగినంత కదలికల్లేని వారు, అలానే కొనసాగి ముప్పు తెచ్చుకోవడం ఎందుకు..? కనీసం వీలైనంత సమయం నడవడం, ఇతర కసరత్తులు చేయాలి. కదలికల్లేని సమయాన్ని వీలైనంత మేర తగ్గించుకోగలిగితే చాలు.