'ఆచార్య' నుంచి భలే భలే బంజారా' ఫుల్ సాంగ్ రిలీజ్ .. చూసేయండి!
- ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఆచార్య'
- మణిశర్మ స్వరపరిచిన 'భలే భలే బంజారా' సాంగ్
- మాస్ బీట్ గా మంచి మార్కులు కొట్టేసిన పాట
- పూర్తి పాటను వదిలిన సినిమా టీమ్
చిరంజీవి - చరణ్ ప్రధానమైన పాత్రలను పోషించిన 'ఆచార్య' ఏప్రిల్ 29వ తేదీన థియేటర్లకు వచ్చింది. నిరంజన్ రెడ్డి - అన్వేశ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహించాడు. మణిశర్మ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చారు. ఆయన కట్టిన బాణీలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈ సినిమా నుంచి 'భలే భలే బంజారా' పూర్తి పాటను రిలీజ్ చేశారు. నక్సలైట్లుగా ఉన్న ఆచార్య - సిద్ధ .. బృందంపై, రాత్రివేళలో గిరిజన గూడెంలో చిత్రీకరించిన పాట ఇది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను, శంకర్ మహదేవన్ - రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఈ పాటకి హైలైట్.
చిరంజీవితో పోటీ పడి చరణ్ స్టెప్స్ వేయడం ఈ పాటలో కనిపిస్తుంది. మణిశర్మ అందించిన అద్భుతమైన మాస్ బీట్స్ లో ఇది ఒకటి. అటవీ ప్రాంతంలోని ఒక కోయగూడెంలో .. ఓ వెన్నెల రాత్రిలో నక్సలైట్స్ సరదాగా ఆడిపాడితే ఎలా ఉంటుందనేది బాగా అర్థం చేసుకుని మణిశర్మ ఈ బీట్ అందించిన విషయం తెలిసిపోతూనే ఉంటుంది.