మోటరోలా జీ82 5జీ స్మార్ట్ ఫోన్ విడుదల.. త్వరలో భారత్ కు

  • యూరోప్ లో విడుదల
  • త్వరలో అమెరికా, భారత్ ఇతర మార్కెట్లకు
  • 6జీ, 128 జీబీ ధర రూ.27,000
మోటరోలా మధ్య శ్రేణి ధరలో మోటో జీ82 5జీ స్మార్ట్ ఫోన్ ను అంతర్జాతీయంగా విడుదల చేసింది. దీని ధర మన కరెన్సీలో సుమారు రూ.27,000. జీ82ను త్వరలో భారత్ మార్కెట్లోనూ విడుదల చేయనున్నట్టు మోటోరోలా ధ్రువీకరించింది. ప్రస్తుతం యూరోప్ లో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. భారత్ సహా ఇతర మార్కెట్లకు త్వరలో చేరనుంది. 

మోటో జీ82 5జీ 6.6 అంగుళాల ఓఎల్ఈడీ, పుల్ హెచ్ డీ డిస్ ప్లేతో ఉంటుంది. స్క్రీన్ రీఫ్రెష్ రేటు 120 హెర్జ్ రేటుతో ఉంటుంది. వెనుక భాగంలో మూడు కెమెరాలను కంపెనీ ఏర్పాటు చేసింది. 50 మెగాపిక్సల్ ప్రధాన సెన్సార్, 8 మెగా పిక్సల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సల్ మాక్రో లెన్స్ ఉంటాయి. ముందు భాగంలో సెల్ఫీల కోసం 16 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు.

క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్ సెట్ ను వినియోగించారు. 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీతో వస్తుంది. ఇందులో 5,000 మెగాపిక్సల్ కెమెరా ఉంటుంది. బాక్స్ తోపాటే 30 వాట్ టర్బో పవర్ అడాప్టర్ కూడా వస్తుంది. పవర్ కీ వద్దే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది. మోటోరోలా ఇటీవలే మోటో ఎడ్జ్ 30 విడుదల చేసింది. కనుక కొంత విరామం తర్వాత జీ82 5జీ ఇక్కడి మార్కెట్లో విడుదల చేయవచ్చని భావిస్తున్నారు.


More Telugu News