'ఎఫ్ 3' నుంచి కాల్ రాగానే టెన్షన్ పడ్డాను: సోనాల్ చౌహన్
- 'ఎఫ్ 3'లో కీలకమైన రోల్ చేసిన సోనాల్ చౌహన్
- ఇంతకుముందు కామెడీ రోల్స్ చేయలేదని చెప్పిన సోనాల్
- ఫస్టు టైమ్ అనిల్ రావిపూడి చేయించడంతో వ్యాఖ్య
- సినిమా చాలా బాగా వచ్చిందంటూ స్పష్టీకరణ
తెలుగు తెరకి తమదైన గ్లామర్ టచ్ ఇచ్చిన అందమైన కథానాయికలలో సోనాల్ చౌహాన్ ఒకరు. తెలుగులో ఆమె బాలకృష్ణ సరసన చేసిన సినిమాలు ఎక్కువ. రీసెంట్ గా ఆమె నాగార్జున సరసన నాయికగా 'ది ఘోస్ట్ ' సినిమా చేసింది. ఇక ఇదే సమయంలో ఆమె అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 3' సినిమాను కూడా పూర్తిచేసింది.
తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. "అనిల్ రావిపూడి కామెడీ కంటెంట్ ను చాలా గొప్పగా తెరకెక్కిస్తారు. ఆయన నుంచి వచ్చిన 'ఎఫ్ 2' చూశాను. అందువలన ఆయన నుంచి కాల్ రాగానే కంగారు పడిపోయాను. ఎందుకంటే నేను అప్పటివరకూ కామెడీ చేయనేలేదు. ఈ సినిమాలో రొమాంటిక్ టచ్ తో కూడిన కామెడీ రోల్ ఉందని ఆయన చెప్పగానే ఓకే అనేశాను.
అయితే, నేను అంతవరకూ కామెడీ రోల్స్ చేయలేదనీ .. ఎలా ప్రిపేర్ కావాలో తెలియడం లేదని అనిల్ రావిపూడితో అన్నాను. మీరు అలాంటి టెన్షన్స్ పెట్టుకోకుండా సమయానికి షూటింగుకి వస్తే చాలు అని ఆయన అన్నారు. ఆయన చెప్పినట్టుగా కెమెరా ముందు చేస్తే చాలు అనే విషయం ఆ తరువాత నాకు అర్థమైంది. వెంకీ .. వరుణ్ లతో కలిసి నటించడం నా అదృష్టం. తమన్నా .. మెహ్రీన్ నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు" అని చెప్పుకొచ్చింది. ఈ నెల 27వ తేదీన ఈ సినిమా విడుదలవుతోంది.