500 సెంటర్లలో 50 రోజులు పూర్తిచేసుకున్న 'ఆర్ ఆర్ ఆర్'

  • మార్చి 25వ తేదీన విడుదలైన 'ఆర్ ఆర్ ఆర్'
  • రికార్డు స్థాయిలో దక్కిన ఓపెనింగ్స్
  • వేయి కోట్ల మార్కును తేలికగా టచ్ చేసిన సినిమా
  • విజయంలో కీలక పాత్రను పోషించిన కీరవాణి సంగీతం
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - చరణ్  కథానాయకులుగా 'ఆర్ ఆర్ ఆర్' సినిమా రూపొందింది. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాను మార్చి 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. తాజాగా ఈ సినిమా 500 థియేటర్లలో 50 రోజులను పూర్తిచేసుకుంది. ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో  50 రోజులను పూర్తి చేసుకున్న సినిమా ఇదే.

కొమరం భీమ్ గా ఎన్టీఆర్ .. అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. సినిమా విడుదలకి ముందే పాటలన్నీ కూడా జనంలోకి దూసుకుపోయాయి. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ ఆర్టిస్టులు ఈ సినిమాలో కనిపించారు.

విజయేంద్ర ప్రసాద్ కథాకథనాలు ..  రాజమౌళి ఆయా పాత్రలను మలచిన తీరు  .. ఆయన టేకింగ్ .. ఎన్టీఆర్ - చరణ్ నటన .. అజయ్ దేవగణ్ ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. తొలి రోజునే రికార్డుస్థాయి వసూళ్లతో తన ఓపెనింగ్స్ ను మొదలుపెట్టిన ఈ సినిమా, 1000 కోట్ల మార్కును అందుకోకపోవడానికి ఎక్కువ సమయం తీసుకోకపోవడం విశేషం.


More Telugu News