విగతజీవిగా కనిపించిన కేరళ మోడల్-నటి.. పోలీసుల అదుపులో భర్త
- ఏడాదిన్నర క్రితమే సజ్జాద్-సహానా వివాహం
- అదనపు కట్నం కోసం భర్త, అత్తింటి వారు వేధించారన్న బాధిత కుటుంబ సభ్యులు
- చెక్కు కోసం ఇద్దరి మధ్య గొడవ జరిగిందని ఆరోపణ
కేరళకు చెందిన మోడల్, నటి అయిన 20 ఏళ్ల సహానా కోజికోడ్‌లోని తన నివాసంలో విగతజీవిగా కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆమె భర్త సజ్జాద్ (31)ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కోజికోడ్‌కు 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న పరంబిల్ బజార్‌లో ఉన్న తన నివాసంలో సహానా గురువారం రాత్రి విండో రెయిలింగ్‌కు వేలాడుతూ కనిపించింది. ఆమె మరణం చుట్టూ అనుమానాలు అల్లుకున్నాయి.
గురువారం సహానా 20వ బర్త్ డే అని, సెలబ్రేట్ చేసుకునేందుకు ఇంటికి వస్తానని తమకు ఫోన్ చేసి చెప్పిందని సహానా తల్లి ఉవెయ్మా తెలిపారు. ఆ సమయంలో ఆమె చాలా ఆనందంగా కనిపించిందని, ఆమె ఆత్మహత్య చేసుకుందని తాను ఆనుకోవడం లేదని అన్నారు. తన కుమార్తెను ఆమె భర్త సజ్జాదే హత్య చేసి ఉంటాడని ఆరోపించారు. ఓ ప్రకటన కోసం అందుకున్న చెక్‌ను తనకు ఇవ్వకపోతే చంపేస్తానని సహానాను అతడు బెదిరించాడని పేర్కొన్నారు.
ఏడాదిన్నర క్రితం కోజికోడ్‌కు చెందిన సజ్జాద్‌తో సహానాకు వివాహమైంది. ఆ సమయంలో అతడు ఖతార్‌లో పనిచేస్తున్నాడు. పెళ్లి అయిన తర్వాతే సహానా మోడలింగ్‌లోకి వెళ్లిందని, తమిళ సినిమాల్లోనూ నటించిందని ఉవెయ్మా తెలిపారు. సహానా బాగా సంపాదిస్తుండడంతో సజ్జాద్ తిరిగి ఖతార్ వెళ్లేందుకు నిరాకరించాడని పేర్కొన్నారు. ఆమె సంపాదించిన డబ్బును ఖర్చు చేయడాన్ని అలవాటుగా మార్చుకున్నాడని ఆరోపించారు. పెళ్లయిన తర్వాత సహానాకు అత్తింటి నుంచి వేధింపులు మొదలయ్యాయని ఆమె బంధువులు కూడా ఆరోపిస్తున్నారు. సజ్జాద్ కూడా ఆమెను వేధించేవాడని తెలిపారు.
సహానా మరణం తర్వాత సజ్జాద్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు. చెక్కు విషయంలో సహానా-సజ్జాద్ మధ్య గొడవ జరిగినట్టు తెలిసిందని పోలీసులు తెలిపారు. సజ్జాద్ మాత్రం ఆమె తనంత తానే ఉరివేసుకుని మరణించినట్టు చెబుతున్నాడని పేర్కొన్నారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.