ఏపీ సీఎస్ స‌మీర్ శ‌ర్మ సర్వీసు 6 నెల‌ల పొడిగింపు

  • ఈ నెలాఖ‌రుతో ముగియ‌నున్న‌ స‌మీర్ శ‌ర్మ స‌ర్వీసు
  • సీఎస్ స‌ర్వీసును 6 నెల‌లు పొడిగించాలంటూ జ‌గ‌న్ లేఖ‌
  • జ‌గన్ ప్ర‌తిపాద‌న‌కు ఓకే చెప్పిన కేంద్రం
  • న‌వంబ‌ర్ 30 వ‌ర‌కు స‌మీర్ శ‌ర్మ స‌ర్వీసు పొడిగింపు
  • ఉత్త‌ర్వులు జారీ చేసిన డీవోపీటీ
ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా కొన‌సాగుతున్న సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి స‌మీర్ శ‌ర్మ సర్వీసును మ‌రో 6 నెల‌ల పాటు పొడిగిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం శుక్ర‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇటీవ‌లే ఏపీ సీఎస్‌గా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన స‌మీర్ శ‌ర్మ‌... ఈ నెలాఖ‌రుతో త‌న సర్వీసును ముగించాల్సి ఉంది. 

అయితే ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి... స‌మీర్ శ‌ర్మ  ప‌ద‌వీ కాలాన్ని ఆరు నెల‌ల పాటు పొడిగించాలంటూ కేంద్ర ప్ర‌భుత్వానికి లేఖ రాశారు. జ‌గ‌న్ ప్ర‌తిపాద‌న‌కు సానుకూలంగా స్పందించిన కేంద్రం...సీఎస్ స‌మీర్ శ‌ర్మ ప‌ద‌వీ కాలాన్ని మ‌రో 6 నెలల పాటు అంటే... న‌వంబ‌ర్ 30 వ‌ర‌కు పొడిగించేందుకు అంగీక‌రించింది. ఈ మేర‌కు డీవోపీటీ శుక్ర‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది.


More Telugu News