బండి సంజయ్ కు లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్
- కేటీఆర్ వల్ల 27 మంది ఇంటర్ విద్యార్థులు మరణించారంటూ ఇటీవల బండి సంజయ్ ట్వీట్
- 48 గంటల్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్
- లేనిపక్షంలో పరువు నష్టం దావా వేస్తానని వెల్లడి
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు రాష్ట్ర మంత్రి కేటీఆర్ తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులు పంపించారు. ఇటీవల కేటీఆర్ ను ఉద్దేశిస్తూ బండి సంజయ్ ఒక ట్వీట్ చేశారు. 'మంత్రి కేటీఆర్ నిర్వాకం వల్ల 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు మరణిస్తే కనీసం స్పందించని దౌర్భాగ్య ముఖ్యమంత్రి కేసీఆర్' అని బండి సంజయ్ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ పై కేటీఆర్ గత ఆదివారం స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలను బండి సంజయ్ తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. అయితే బండి సంజయ్ ఏమాత్రం స్పందించకపోవడంతో కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. 48 గంటల్లో కేటీఆర్ కు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని నోటీసులో న్యాయవాది పేర్కొన్నారు. లేనిపక్షంలో పరువు నష్టం దావా వేస్తామని పేర్కొన్నారు. ఈ నోటీసులపై బండి సంజయ్ స్పందించాల్సి ఉంది.