టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేనిపై కేసు కొట్టివేత
- మహిళపై దాడి చేశారంటూ చింతమనేనిపై ఫిర్యాదు
- 2011లో ఏలూరు పీఎస్‌లో కేసు నమోదు
- అభియోగాలు రుజువు కాకపోవడంతో కొట్టేసిన కోర్టు
టీడీపీ సీనియర్ నేత, ఏలూరు జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై నమోదైన కేసును విజయవాడలోని ప్రజా ప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. ఈ మేరకు శుక్రవారం నాడు ఈ కేసుపై విచారణ చేపట్టిన కోర్టు...చింతమనేనిపై అభియోగాలను పోలీసులు నిరూపించలేకపోయారని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే చింతమనేనిపై కేసును కొట్టివేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.
2011లో ఓ మహిళపై దాడి చేశారంటూ చింతమనేనిపై అందిన ఫిర్యాదు ఆధారంగా ఆయనపై ఏలూరు పోలీస్ స్టేషన్‌లో ఓ కేసు నమోదైంది. ఈ కేసుపై సుదీర్ఘ విచారణ జరగగా... కేసులో చింతమనేనిపై నమోదు చేసిన అభియోగాలు రుజువు కాలేదు. దీంతోనే కోర్టు ఆయనపై నమోదైన ఈ కేసును కొట్టివేసింది.