వరుసగా ఆరో రోజు నష్టపోయిన మార్కెట్లు

  • లాభాల స్వీకరణకు మొగ్గుచూపిన ఇన్వెస్టర్లు
  • 136 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 25 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో రోజు నష్టాల్లో ముగిశాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్సియల్, మెటల్ స్టాకులు ఎక్కువగా నష్టపోయాయి. ఈ రోజు ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు అదే ఊపును కొనసాగించాయి. అయితే చివరి గంటన్నరలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో లాభాలు ఆవిరైపోయాయి.

ఈ క్రమంలో ఇంట్రాడేలో సెన్సెక్స్ గరిష్ఠం నుంచి ఏకంగా 900 పాయింట్లకు పైగా పతనమయింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 136 పాయింట్లు నష్టపోయి 52,793కి పడిపోయింది. నిఫ్టీ 25 పాయింట్లు కోల్పోయి 15,782 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
సన్ ఫార్మా (3.76%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.78%), హిందుస్థాన్ యూనిలీవర్ (2.49%), ఐటీసీ (2.25%), టైటాన్ (2.08%). 

టాప్ లూజర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-3.76%), ఐసీఐసీఐ బ్యాంక్ (-2.65%), ఎన్టీపీసీ (-2.56%), భారతి ఎయిర్ టెల్ (-2.32%), యాక్సిస్ బ్యాంక్ (-2.07%).


More Telugu News