శిరోజాలకు నూనె పట్టించి ఎంత సేపు ఉంచుకోవచ్చు..?
- 30-45 నిమిషాల పాటు ఉండొచ్చు
- ఆ తర్వాత తల స్నానం చేయాలి
- నూనె పట్టించి రాత్రంతా వదిలేయకూడదు
- దోషం పెరుగుతుందంటున్న ఆయుర్వేదం
రూపంలో ప్రధాన పాత్ర కలిగిన శిరోజాల సంరక్షణ నేడు పెద్ద సవాలుగానే మారిందని చెప్పుకోవచ్చు. తినే ఆహారంతో కావాల్సినన్ని పోషకాలు అందకపోవడం, ఒత్తిళ్లు, రసాయనాలతో కూడిన షాంపూల వినియోగం, వాయు, నీటి కాలుష్యం ఇలా ఎన్నో అంశాలు జుట్టు రాలేందుకు కారణమవుతున్నాయి. మరోవైపు శిరోజాలకు నూనె పట్టించే వారు కూడా తగ్గిపోతున్నారు. అయితే, తల వెంట్రులకు నూనె రాసుకునే వారు కూడా .. సరైన విధానం పట్ల అవగాహన కలిగి ఉండడం లేదు.
చంటి పిల్లల తలకు కొబ్బరి నూనె, ఆముదాన్ని అమ్మలు, అమ్మమ్మలు దిట్టంగా పట్టించడం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అంటే శిరోజాల ఆరోగ్యానికి నూనె కూడా సాయపడుతుందని అర్థమవుతోంది. అయితే, తలకు నూనె రాసుకుని అలా వదిలేయకూడదని ఆయుర్వేదం చెబుతోంది. ఈ విషయాన్ని ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ రేఖ రాధామణి వివరంగా తెలియజేశారు.
‘‘తలకు నూనె రాసి రాత్రంతా అలా వదిలేస్తే కఫ దోషం పెరిగిపోతుంది. తలకు నూనె రాసి 30-45 నిమిషాలకు మించి ఉంచుకోవద్దు. ఆ తర్వాత తల స్నానం చేయాలి. కేరళ ఆయుర్వేద విధానాల నుంచి ఇది వచ్చింది. భారత్ సంస్కృతి ఎంతో సంపన్నమైంది. బ్రిటిష్ పాలనకు ముందు నుంచే ఆయుర్వేదం ఆచరణలో ఉంది. సిజేరియన్లు, ప్లాస్టిక్ సర్జరీలను సైతం ఆయుర్వేద సూత్రాలకు అనుగుణంగానే చేసేవారు. బ్రిటిష్ పాలనలో, ఉత్తరాదిన ఆయుర్వేదం ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నది.
దక్షిణాదిన అష్ట వైద్యం కొనసాగింది. బ్రిటిష్ పాలకుల నుంచి వ్యతిరేకత ఉన్నా, కేరళలోని ఎనిమిది కుటుంబాలు ఆయుర్వేద ప్రాక్టీస్ కొనసాగించాయి. అందుకే నేటికీ ఆయుర్వేదంలో కేరళ బలంగా ఉంటుంది. నా చిన్నప్పుడు తలపై నూనెను ఎక్కువ సేపు ఉంచుకోకుండా కడిగేసుకోవాలనే సూచించేవారు’’ అని డాక్టర్ రేఖ తన బ్లాగులో తాజా పోస్ట్ పెట్టారు.
నేడు మనం ఆచరిస్తున్న ఎన్నో విధానాలు పాశ్చాత్య ప్రభావాలవల్లేనని ఆమె చెప్పారు. ‘‘లంచ్ కు ముందు రా సలాడ్స్ (పచ్చి కూరగాయలు) తీసుకోవడం అన్నది బ్రిటిష్ పాలనకు ముందు భారత్ లో లేనే లేదు. ఆయుర్వేదం సాధారణంగా వేడిగా ఉన్న, ఉడికించిన ఆహారాన్ని తీసుకోవాలని చెబుతోంది. ముఖ్యంగా అగ్ని దోషం ఉన్న వారికి ఆహారంతో పాటు సలాడ్స్ మంచివి కావు’’ అని వివరించారు.