కేసీఆర్ సర్కార్ అధికార దుర్వినియోగానికి ఇదొక మచ్చు తునక మాత్రమే: విజయశాంతి
- అధికార పార్టీ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోందన్న విజయశాంతి
- టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం కోసం కారుచౌకగా భూమిని కేటాయించారని విమర్శ
- టీఆర్ఎస్ కార్యాలయానికి రూ.70 కోట్ల విలువైన భూమి ఇచ్చారని వ్యాఖ్య
తెలంగాణ సర్కారుపై బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శలు గుప్పించారు. ''అధికార పార్టీ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం కోసం కారుచౌకగా భూమిని కేటాయించారు. పార్టీ హైదరాబాద్ జిల్లా కార్యాలయానికి ప్రభుత్వం రూ.70 కోట్ల విలువైన భూమిని కేటాయించింది.
ఇంత విలువైన భూమి టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్, ఎంపీ కె.కేశవరావు ఇంటి పక్కనే ఈ స్థలం ఉంది. దీన్ని కేటాయించాలని టీఆర్‌ఎస్ విజ్ఞప్తి చేయగానే... సచివాలయం నుంచి వచ్చిన ఆదేశాలతో ఈ నెల 9న జిల్లా కలెక్టర్ శర్మన్ ప్రతిపాదనలు పంపారు.
ఆ మరుసటి రోజే భూపరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం... భూమి కేటాయింపుపై సిఫారసు చేస్తూ ప్రభుత్వానికి ఫైలును పంపించింది. ఆ తర్వాత రోజు అంటే, మే 11న రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆగమేఘాల మీద భూమిని కేటాయిస్తూ జీవో నం.47ను జారీ చేశారు.
ఎన్‌బీటీ నగర్‌లో గజం రూ.లక్షన్నర ధర పలుకుతోంది. అంటే ఈ భూమి విలువ రూ.70 కోట్లపైనే. కానీ, 2018 ఆగస్టు 16న ప్రభుత్వం విడుదల చేసిన పాలసీ ప్రకారం గజం రూ.100 చొప్పున టీఆర్‌ఎస్ పార్టీ ఈ స్థలానికి రూ.4.93 లక్షలు చెల్లిస్తే సరిపోతుంది.
కేసీఆర్ సర్కార్ అధికార దుర్వినియోగానికి ఇదొక మచ్చు తునక మాత్రమే.. ఇలాంటివి రాష్ట్రవ్యాప్తంగా కోకొల్లలుగా జరుగుతూనే ఉన్నాయి. కేసీఆర్... నీ ఆటలు ఇక ఎంతో కాలం సాగవు. ప్రజలు అన్నీ చూస్తునే ఉన్నరు. నీకు, నీ పార్టీ తగిన బుద్ధి చెప్పే రోజు తొందర్లోనే రానుంది'' అని విజయ శాంతి విమర్శించారు.