అలాట్ మెంట్ ప్రక్రియ పూర్తి.. 17న ఎల్ఐసీ లిస్టింగ్!
- ఒక్కో షేరు ఇష్యూ ధర రూ.949గా ఖరారు
- సోమవారం ఇన్వెస్టర్ల డీమ్యాట్ ఖాతాల్లో షేర్ల జమ
- కేంద్ర సర్కారుకు రూ.20వేల కోట్లు
ఎల్ఐసీ ఐపీవో రూపంలో కేంద్ర ప్రభుత్వం 20,560 కోట్లు (2.7 బిలియన్ డాలర్లు) సమీకరించింది. దేశంలో ఇంత మొత్తంలో నిధులు సమీకరించిన ఐపీవో మరేదీ లేదు. ఈ నెల 4న మొదలైన ఎల్ఐసీ ఐపీవో 9న ముగిసిన విషయం తెలిసిందే. ఒక్కో షేరును రూ.949కు కేటాయించాలని ఎల్ఐసీ నిర్ణయించింది. ఈ ఇష్యూలో భాగంగా 16.2 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా, మూడు రెట్లు అధికంగా 47.8 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి.
పాలసీదారులకు ఒక్కో షేరుపై ఎల్ఐసీ రూ.60 డిస్కౌంట్ ఆఫర్ చేసింది. రిటైల్ ఇన్వెస్టర్లకు రూ.45 తగ్గింపు ఇచ్చింది. షేర్ల అలాట్ మెంట్ ప్రక్రియ ముగిసింది. అలాట్ కాని వారికి బ్లాక్ అయిన నగదు మొత్తం శుక్రవారం అన్ బ్లాక్ అవుతుంది. వచ్చే సోమవారం ఇన్వెస్టర్ల డీమ్యాట్ ఖాతాల్లో షేర్లు జమ అవుతాయి. మంగళవారం, 17న స్టాక్ ఎక్సేంజ్ ల్లో ఎల్ఐసీ లిస్ట్ కానుంది. జీవిత బీమా రంగంలో 65 శాతం మార్కెట్ వాటాతో ఎల్ఐసీ దిగ్గజ సంస్థగా ఉండడం తెలిసిందే.