ప్రభుత్వ ఆఫీసుకెళ్లి... కశ్మీరీ పండిట్ ను పాయింట్ బ్లాంక్ లో కాల్చి చంపిన టెర్రరిస్టులు!
- జమ్ముకశ్మీర్ లోని బుద్గాం జిల్లాలో దారుణం
- ప్రభుత్వ ఉద్యోగి రాహుల్ భట్ ను కార్యాలయంలోనే కాల్చి చంపిన ఉగ్రవాదులు
- టెర్రరిస్టుల కోసం కొనసాగుతున్న గాలింపు
జమ్ముకశ్మీర్ లో కశ్మీరీ పండిట్లపై దారుణాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా బుద్గాం జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగి అయిన ఓ కశ్మీరీ పండిట్ ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. చదూరా ప్రాంతంలోని తహసీల్ కార్యాలయంలో రాహుల్ భట్ అనే కశ్మీరీ పండిట్ క్లర్క్ గా విధులు నిర్వహిస్తున్నారు.
తహసీల్ కార్యాలయంలోకి ప్రవేశించిన ఇద్దరు ఉగ్రవాదులు ఆయనను పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చి చంపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ భట్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన మృతి చెందారు. ఘటన జరిగిన తర్వాత భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకుని, ఉగ్రవాదుల కోసం గాలింపు జరుపుతున్నాయి.