ఢిల్లీలో వెంకన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం
- ఢిల్లీలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు
- ప్రారంభించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
- ఈ నెల 22 వరకు కొనసాగనున్న ఉత్సవాలు
దేశ రాజధాని ఢిల్లీలో శ్రీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు గురువారం శాస్త్రబద్ధంగా ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవాలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన శాస్త్రబద్ధంగా ఉత్సవాలకు అంకురార్పణ పూజ చేశారు.
గురువారం నుంచి ఈ నెల 22 దాకా ఉత్సవాలు కొనసాగనున్నట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలో మాదిరే ఢిల్లీలోనూ శాస్త్రబద్ధంగా వెంకన్న బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఉత్సవాల ప్రారంభోత్సవంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, టీటీడీ సలహా మండలి చైర్మన్ ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.