97 పరుగులకే కుప్పకూలిన చెన్నై... ధోనీయే టాప్ స్కోరర్
- నేడు ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి
- 16 ఓవర్లలోనే చెన్నై ఆలౌట్
- 36 పరుగులతో నాటౌట్ గా నిలిచిన ధోనీ
- 3 వికెట్లతో దెబ్బతీసిన డానియెల్ శామ్స్
గతంలో ఎన్నడూ లేనంతగా వైఫల్యాల బాటలో నడుస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ ఇవాళ ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ లో తడబాటుకు గురైంది. ముంబయి జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా, చెన్నై జట్టు బ్యాటింగ్ కు దిగింది. కానీ, ముంబయి బౌలర్ల ధాటికి చెన్నై జట్టు 16 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలింది. అందరికంటే అత్యధికంగా ధోనీ 36 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 33 బంతులు ఎదుర్కొన్న ధోనీ 4 ఫోర్లు, 2 సిక్స్ లు కొట్టాడు. ధోనీ రాణించడంతో చెన్నై ఆమాత్రం స్కోరైనా చేయగలిగింది.
ముంబయి బౌలర్ డానియెల్ శామ్స్ చెన్నై జట్టును ఆరంభంలోనే దెబ్బతీశాడు. ఫామ్ లో ఉన్న డెవాన్ కాన్వే (0) వికెట్ తీసిన శామ్స్... ఆ తర్వాత మొయిన్ అలీ (0), రుతురాజ్ గైక్వాడ్ (7)లను అవుట్ చేశాడు. శామ్స్ కు తోడు బుమ్రా (1 వికెట్), రిలే మెరిడిత్ (2 వికెట్లు), కుమార్ కార్తికేయ (2 వికెట్లు), రమణ్ దీప్ సింగ్ (1 వికెట్) కూడా రాణించడంతో చెన్నై జట్టు పరుగులు సాధించేందుకు విలవిల్లాడింది.
ఓ దశలో ఆ జట్టు 39 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. అయితే, ధోనీ (36), రాయుడు (10), శివమ్ దూబే (10), డ్వేన్ బ్రావో (12) తలో చేయి వేయడంతో చెన్నై స్కోరు 90 మార్కు దాటింది.