రెవెన్యూ డివిజ‌న్‌గా రేప‌ల్లె... ఏపీ కేబినెట్ నిర్ణ‌యంపై ఎంపీ మోపిదేవి హర్షం

  • కొత్త డివిజ‌న్‌లో రేప‌ల్లె, వేమూరు నియోజ‌క‌వ‌ర్గాలు
  • ఇప్ప‌టికే రాష్ట్రంలో రెవెన్యూ డివిజ‌న్ల సంఖ్య 74
  • రేప‌ల్లె చేరిక‌తో 75కు చేరిన రెవెన్యూ డివిజ‌న్ల సంఖ్య‌
ఏపీలో మ‌రో కొత్త రెవెన్యూ డివిజ‌న్‌ను ఏర్పాటు చేస్తూ ఆ రాష్ట్ర కేబినెట్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. గుంటూరు జిల్లా ప‌రిధిలోని రేప‌ల్లె కేంద్రంగా ఏర్పాటు కానున్న ఈ డివిజ‌న్‌లో రేప‌ల్లెతో పాటు వేమూరు అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గాల ప‌రిధిలోని మండ‌లాలు కొన‌సాగ‌నున్నాయి. ఈ మేర‌కు గురువారం భేటీ అయిన రాష్ట్ర మంత్రివ‌ర్గం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

రేప‌ల్లెను రెవెన్యూ డివిజ‌న్‌గా ప్ర‌క‌టిస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణ‌యంపై వైసీపీ సీనియ‌ర్ నేత‌, ఆ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఇదిలా ఉంటే... కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా ఆయా జిల్లాల్లో కొత్త‌గా రెవెన్యూ డివిజ‌న్ల‌ను కూడా ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌టికే ఉన్న రెవెన్యూ డివిజ‌న్ల‌తో కొత్త డివిజ‌న్లు క‌లిపి రాష్ట్రంలో మొత్తం 74 రెవెన్యూ డివిజ‌న్లు ఉన్నాయి. ఇప్పుడు కొత్త‌గా రేప‌ల్లె కూడా రెవెన్యూ డివిజ‌న్‌గా మార‌నుండ‌టంతో వాటి మొత్తం సంఖ్య 75కు చేరుకోనుంది.


More Telugu News