ఢిల్లీలో రైలెక్కిన రాహుల్ గాంధీ... ఉదయ్‌పూర్‌కు పయనం
- రేపటి నుంచి ఉదయ్ పూర్ వేదికగా చింతన్ శిబిర్
- మూడు రోజుల పాటు జరగనున్న సమావేశం
- ఢిల్లీలోని సరాయి రోహిల్లా రైల్వే స్టేషన్‌లో ట్రైన్ ఎక్కిన రాహుల్
2024 ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మేధోమధనం కోసం చింతన్ శిబిర్ పేరిట నిర్వహిస్తున్న సభకు కాంగ్రెస్ పార్టీ కీలక నేతలంతా రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు పయనమవుతున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాలకు చెందిన ఆ పార్టీ నేతలు ఉదయ్‌పూర్ చేరుకోగా... తాజాగా గురువారం ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఢిల్లీ నుంచి బయలుదేరారు.
ఢిల్లీ నుంచి ఉదయ్‌పూర్ చేరుకునేందుకు రాహుల్ గాంధీ రైలు ప్రయాణాన్ని ఎంచుకున్నారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలోని సరాయి రోహిల్లా రైల్వే స్టేషన్‌కు చేరుకున్న రాహుల్ గాంధీ అక్కడే ఉదయ్‌పూర్ ట్రైన్ ఎక్కేశారు. ఇదిలా ఉంటే... ఉదయ్‌పూర్‌లో రేపు (జూన్ 13) ప్రారంభం కానున్న చింతన్ శిబిర్ ఈ నెల 15 వరకు మూడు రోజుల పాటు జరగనుంది. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా పార్టీ అధిష్ఠానం 400 మంది కీలక నేతలకు ఆహ్వానం పంపిన సంగతి తెలిసిందే.