'పుష్ప 2'లో మరో హీరోయిన్ కి ఛాన్స్?!

'పుష్ప 2'లో మరో హీరోయిన్ కి ఛాన్స్?!
  • సంచలన విజయాన్ని సాధించిన 'పుష్ప'
  • సెకండ్ పార్టు స్క్రిప్ట్ పై జరుగుతున్న కసరత్తు
  • వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించే ఛాన్స్ 
  • ఐటమ్ సాంగ్ కోసం రంగంలోకి దిశా పటాని  
సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన 'పుష్ప' సినిమా సంచలన విజయాన్ని సాధించింది. తెలుగుతో పాటు మిగతా భాషల్లోను రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ మరో స్థాయికి వెళ్లాడు. దేవిశ్రీ ప్రసాద్ పాటలు ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాయి.

ఈ సినిమాలో బన్నీ సరసన నాయికగా రష్మిక మెరిసింది. శ్రీవల్లీ పాత్రలో ఆమె మంచి మార్కులు కొట్టేసింది. ఫస్టు పార్టులో శ్రీవల్లితో పుష్ప పెళ్లి జరిగిపోతుంది. అక్కడి నుంచి రెండవ భాగం మొదలవుతుంది. జూన్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. 

రెండవ భాగంలో కూడా కథానాయికగా రష్మికనే ఉంటుంది. అయితే సెకండ్ హీరోయిన్ కి కూడా చోటు ఇస్తూ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సెకండ్ హీరోయిన్ తోను పుష్ప రొమాన్స్ ఉంటుందని అంటున్నారు. ఆ కథానాయిక ఎంపిక త్వరలోనే పూర్తి చేస్తారట. ఇక స్పెషల్ సాంగ్ కోసం దిశా పటానీని దింపుతున్నారని అంటున్నారు.


More Telugu News