ఆ 4 సీట్లూ వైసీపీవే!... ఆశావహుల జాబితా ఇదే!
- ఏపీలో ముగియనున్న నలుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం
- అసెంబ్లీలో సభ్యుల బలాల ఆధారంగా 4 సీట్లూ వైసీపీకే
- పార్టీ పరిశీలనలో ఐదుగురు నేతలు
- విజయసాయిరెడ్డి, బీద మస్తాన్ రావు సహా మరో ముగ్గురి పేర్ల పరిశీలన
తెలుగు రాష్ట్రాలతో పాటు 15 రాష్ట్రాల్లో ఖాళీ కానున్న 57 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ 57 సీట్లలో 4 సీట్లు ఏపీకి చెందినవి. ఖాళీ కానున్న స్థానాల్లో వైసీపీకి చెందిన ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డితో పాటు బీజేపీ ఎంపీలుగా కొనసాగుతున్న సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, సురేశ్ ప్రభుల సీట్లు ఉన్నాయి.
అయితే వచ్చే నెల 10 జరిగే ఈ ఎన్నికల్లో నాలుగు సీట్లు కూడా అధికార వైసీపీ ఖాతాలోనే పడనున్నాయి. అసెంబ్లీలో ఆ పార్టీ సభ్యుల సంఖ్య ఆధారంగా 4 సీట్లను వైసీపీ గెలవడం ఖాయమే.
ఈ క్రమంలో ఈ సీట్లను దక్కించుకునేందుకు ఆయా వైసీపీ నేతల యత్నాలు ఇప్పటికే మొదలయ్యాయి. అందుబాటులో ఉన్నవి 4 సీట్లే అయినా.. ఆయా స్థానాలను ఆశిస్తున్న వారు మాత్రం చాలా మందే ఉన్నారు. అయితే పార్టీ మాత్రం కొందరి పేర్లనే పరిశీలిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ పరిశీలిస్తున్న వారిలో విజయసాయిరెడ్డి, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య, నిరంజన్ రెడ్డి, సునీల్ ఉన్నారు.